నాగ్ అశ్విన్‌కు తెల్చి చెప్పిన ప్రభాస్‌.. ఫ్యాన్స్ కు నిరాశ

రాధే శ్యామ్‌ పూర్తి అయిన వెంటనే ప్రభాస్ చేయాల్సిన మూవీ నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో.కాని నాగ్‌ అశ్విన్ కంటే ముందు ఆది పురుష్‌ కు సిద్దం అయ్యాడు.

 Prabhas And Nag Aswin Movie Shooting Some More Days Late-TeluguStop.com

సరే ఆదిపురుష్ తర్వాత అయినా నాగ్ అశ్విన్ తో సినిమా ను పట్టాలెక్కిస్తాడనుకుంటే సలార్ ను మొదలు పెట్టాడు.కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి.

రాధే శ్యామ్‌ కరోనా కారనంగా ఇంకా పూర్తి అవ్వలేదు.సలార్‌ మరియు ఆదిపురుష్‌ సినిమాలు కూడా ఆలస్యం అవుతున్నాయి.

 Prabhas And Nag Aswin Movie Shooting Some More Days Late-నాగ్ అశ్విన్‌కు తెల్చి చెప్పిన ప్రభాస్‌.. ఫ్యాన్స్ కు నిరాశ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇలాంటి సమయంలో నాగ్‌ అశ్విన్‌ తో సినిమా కాస్త ఆలస్యం అవుతుందని మొదటి నుండి వార్తలు వస్తున్నాయి.కాని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ మాత్రం ముందు నుండి అనుకున్నట్లుగా సినిమాను ఖచ్చితంగా జూన్‌ లో ప్రారంభించి తీరాల్సిందే అంటూ భీష్మించుకు కూర్చున్నారు.

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో సినిమా విషయంలో ప్రభాస్ ఇన్ని రోజులు మొహమాటంతో సరే చేద్దాం అంటూ వచ్చాడట.కాని తాజాగా అందుతున్ సమాచారం ప్రకారం ప్రభాస్ దర్శకుడు నాగ్ అశ్విన్‌ కు తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది.

నాగ్ అశ్విన్ ను మరో మూడు నాలుగు నెలల సమయం అడిగినట్లుగా తెలుస్తోంది.అన్ని అనుకున్నట్లుగా జరిగితే సినిమాను దసరా సందర్బంగా ప్రారంభించేలా ప్లాన్‌ చేద్దాం అంటూ ప్రభాస్‌ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ కు చెప్పాడని తెలుస్తోంది.

మహానటి తర్వాత దర్శకుడు నాగ్ అశ్విన్ చేస్తున్న సినిమా ఇదే కావడం విశేషం.అందుకే ఈ సినిమ పై అంచనాలు భారీగా ఉన్నాయి.ఇది ఒక సైన్స్ ఫిక్షన్‌ సోషియో ఫాంటసీ సినిమా అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది.సింగీతం శ్రీనివాస్ ఈ సినిమా కు స్క్రిప్ట్‌ వర్క్ చేస్తున్నారు.

బిగ్ బి అమితాబచ్చన్‌ ఈ సినిమాలో నటించడంతో పాటు దీపిక పదుకునే ఈ సినిమాలో నటించబోతున్న కారణంగా బాలీవుడ్ అభిమానులు కూడా ఈ సినిమా పై అంచనాలు పెంచేసుకున్నారు.కాని సినిమా మాత్రం ఇప్పట్లో ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.2022 లో సినిమా విడుదల అనుమానమే అని 2023లో విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు.

##Salaar #Radheshyam #Maha Nati #Prabhas #Nag Aswin

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు