ప్రభాస్ అభిమానుల టెన్షన్‌ ను ఒక్క మాటతో పోగొట్టేసిన దర్శకుడు  

prabhas and nag aswin movie rumors clarity Salaar nag aswmin, Pan India Movie ,Pitta Kathalu ,Prabhas , Telugu Film news ,tollywood ,naga ashwin , - Telugu #salaar, Nag Aswmin, Pan India Movie, Pitta Kathalu, Prabhas, Telugu Film News

యంగ్‌ రెబల్ స్టార్‌ ప్రభాస్ హీరోగా నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ వారు ఒక సినిమాను నిర్మించబోతున్నారు.భారీ బడ్జెట్‌ తో రూపొందబోతున్న ఈ సినిమా ను గత ఏడాదిలోనే ప్రకటించారు.

TeluguStop.com - Prabhas And Nag Aswin Movie Rumors Clarity

కాని కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యం అవుతుంది.ఈ సినిమా కంటే ఆలస్యంగా ప్రకటన వచ్చిన సినిమాఉల కూడా పట్టాలెక్కాయి.

షూటింగ్‌ చక చక జరుపుకుంటున్నాయి.కాని ఇప్పటి వరకు వీరి కాంబో మూవీ విషయమై క్లారిటీ ఇవ్వడం లేదు.

TeluguStop.com - ప్రభాస్ అభిమానుల టెన్షన్‌ ను ఒక్క మాటతో పోగొట్టేసిన దర్శకుడు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇలాంటి సమయలో నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వచ్చిన పిట్ట కథలు వెబ్‌ సిరీస్ లోని ఎక్స్ లైఫ్‌ ఎపిసోడ్‌ కథ ను ప్రభాస్ సినిమా కథగా ప్రచారం చేస్తున్నారు.ఎక్స్‌ లైఫ్‌ కథను మరింతగా విస్తరించి ప్రభాస్‌ తో సినిమా చేస్తున్నారు.

అంతే తప్ప దాంట్లో పెద్ద కథ ఏమీ ఉండబోదు అంటూ కొందరు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ప్రభాస్‌ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రముఖ దర్శకుడు అంటూ నాగ్ అశ్విన్‌ పై అభిమానులు అంచనాలు పెట్టుకుంటే ఇలా చేయడం ఎంత వరకు సబబు అంటూ విమర్శలు చేస్తున్నారు.

సినిమా గురించి వస్తున్న వార్తలపై దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ క్లారిటీ ఇచ్చాడు.ఇప్పటి వరకు సినిమా కథ గురించి వస్తున్న వార్తలన్ని కూడా పుకార్లే.అసలు ఆ కథకు ప్రభాస్ తో చేయబోతున్న సినిమాకు అస్సలు సంబంధం లేదు.మీడియాలో కొందరు కావాలని అలాంటి పుకార్లు పుట్టిస్తున్నారు.

ఒక మంచి కథ ను ఇప్పటికే రెడీ చేయడంతో పాటు స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేసి పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ లో నాగ్‌ అశ్విన్‌ ఉన్నాడు.కనుక కథ విషయంలో ఎలాంటి ఆందోళన అక్కర్లేదు.

నాగ్‌ అశ్విన్‌ ప్రకటనతో ప్రభాస్ అభిమానులు రిలాక్స్ అయ్యారు.హమయ్య ఆ కథ కాకుంటే హ్యాపీ అన్నట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నారు.

జూన్‌ లేదా జులై నెల నుండి వీరి కాంబో మూవీ పట్టాలెక్కి వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుందట.ఈ సినిమాలో ప్రభాస్‌ కు జోడీగా బాలీవుడ్‌ స్టార్‌ హాట్‌ బ్యూటీ దీపిక పదుకునే నటిస్తుంది.

అమితాబచ్చన్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

#Pan India Movie #Nag Aswmin ##Salaar #Pitta Kathalu #Prabhas

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు