క్యాస్టింగ్ కాల్ : ప్రభాస్ సినిమాలో నటించాలనుకుంటున్నారా..? అయితే ఇలా చెయ్యండి ...

తెలుగులో ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఓ భారీ బడ్జెట్ చిత్రంలో హీరోగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ చిత్రానికి అలనాటి అందాల తార మరియు ప్రముఖ స్వర్గీయ నటి సావిత్రి జీవిత గాథను కళ్లకు కట్టినట్లు తెరకెక్కించి తమిళ, తెలుగు సినిమా ప్రేక్షకుల మన్ననలు పొందిన యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు.

 Prabhas And Nag Ashwin Looking For The Casting In Heavy Budget Movie, Prabhas, Y-TeluguStop.com

అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు ప్రారంభం కావాల్సి ఉండగా గత ఏడాది కరోనా వైరస్ కారణంగా తాత్కాలికంగా షూటింగ్ పనులు నిలిపివేశారు.దీంతో ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గడంతో మళ్లీ చిత్ర యూనిట్ సభ్యులు షూటింగ్ పనులు షురూ చేయబోతున్నారు.
  దీంతో తాజాగా ఈ చిత్రంలో నటించడానికి కావలసినటువంటి నటీనటుల కోసం క్యాస్టింగ్ కాల్ ని అనౌన్స్ చేశారు.ఇందులో భాగంగా 9 నుంచి 14 సంవత్సరాలు కలిగిన బాలికలు మరియు 20 నుంచి 35 సంవత్సరాలు కలిగినటువంటి మగ నటులు, డాన్సర్లు, అలాగే మార్షల్ ఆర్ట్స్ లో అనుభవం ఉన్నటువంటి వారు తమ బయోడేటా వివరాలను VYMTALENT@GMAIL.

COM  అనే  మెయిల్ ఐడి కి పంపించాలని కోరారు.

దీంతో ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం దక్కించుకోవాలని కొందరు నెటిజన్లు తమ బయోడేటా వివరాలను చిత్ర యూనిట్ సభ్యులు తెలిపిన ఈ-మెయిల్ ఐడి కి పంపిస్తున్నారు. అంతేగాక ఈ విషయంపై స్పందించిన కొందరు నెటిజన్లు ప్రస్తుతం సినిమా పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి సోషల్ మీడియా మాధ్యమాలు చాలా బాగా ఉపయోగపడతాయని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అంతేగాక ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా దాదాపుగా 300 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ నిర్మిస్తోంది.

కాగా ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ తరహాలో ఉండబోతోందని పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే మరియు మలయాళ యంగ్ బ్యూటీ నివేదాథామస్ లు ప్రభాస్ కి జంటగా నటిస్తున్నారు.

కాగా ఈ చిత్రంలో నటించడానికి ప్రభాస్ దాదాపుగా 100 కోట్ల రూపాయలు పారితోషకంగా తీసుకోబోతున్నాడని కొందరు చర్చించుకుంటున్నారు.ఏదేమైనప్పటికీ బాహుబలి చిత్రంతో ప్రపంచానికి పరిచయమైన ప్రభాస్ తన తదుపరి చిత్రాల్లోని బడ్జెట్ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదని చెప్పవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube