ప్రభాస్ మారుతి.. టైటిల్‌ విషయంలో కొత్త పుకారు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యాం సినిమా ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.ఆ సినిమా విడుదల తర్వాత ప్రభాస్ నుండి అత్యంత ఆసక్తికర ప్రకటన ఒకటి రాబోతుంది అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 Prabhas And Maruthi Movie Title Update, Raja Deluxe, Prabhas, Maruthi, Comedy En-TeluguStop.com

అదే మారుతి దర్శకత్వం లో రూపొందబోతున్న సినిమా గురించి.వీరిద్దరి కాంబినేషన్లో రాజా డీలక్స్ అనే సినిమాను రూపొందించబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి.

డివివి దానయ్య ఈ సినిమాను నిర్మించబోతున్నాడు అని కూడా ప్రచారం మొదలైంది.స్క్రిప్ట్‌ వ్యవహారం కూడా ఒక దశకు వచ్చింది అంటూ క్లారిటీ ఇచ్చేశారు.

అధికారిక ప్రకటన రావడమే తరువాయి.

ఈ సమయంలో సినిమా టైటిల్ విషయం లో మారుతి ఆలోచనలో పడ్డాడు అనే వార్తలు వస్తున్నాయి.రాజా డీలక్స్ అనే టైటిల్ ప్రభాస్ ఇమేజ్ కి తగ్గట్టుగా లేదు అంటూ కొందరు అభిమానులు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆయన తన ఆలోచిస్తున్నట్లు సమాచారం అందుతోంది.ప్రస్తుతం ప్రభాస్ సన్నిహితులతో పాటు తన టీంతో కలిసి స్క్రిప్టు వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్న దర్శకుడు మారుతి, సినిమా కోసం భారీ సెట్టింగ్స్ ను హైదరాబాద్ శివారు ప్రాంతంలో నిర్మించేందుకు సిద్ధం అవుతున్నాడు.

సినిమాకు సంబంధించిన షూటింగ్ కేవలం రెండు నెలల్లో పూర్తి చేసేలా ప్లాన్ చేశాడట.తక్కువ డేట్స్‌ మారుతి కోరడం వల్లనే ఈ సినిమా ప్రభాస్ ఓకే చెప్పాడనే సమాచారం అందుతోంది.

అన్ని అనుకున్నట్లు అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఈ తీసిన సినిమా ను ప్రేక్షకుల ముందుకు ఇదే ఏడాది తీసుకు వస్తాం అన్నట్లుగా దానయ్య ఆ మధ్య చెప్పుకొచ్చారు.ప్రభాస్ ఈ సినిమాలే కాకుండా సలార్‌, ఆదిపురుష్‌ ఇంకా ప్రాజెక్ట్‌ కే సినిమాల్లో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

Prabhas And Maruthi Movie Title Update

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube