Prabhas maruthi : ప్రభాస్‌ యొక్క రాజా డీలక్స్ మహల్ యొక్క ప్రత్యేకతలు ఏంటో తెలుసా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా ప్రస్తుతం చాలా సినిమాలు రూపొందుతున్నాయి.అందులో మారుతి సినిమా ఒకటి.

 Prabhas And Maruthi Film Set Interesting Update  , Prabhas, Maruthi ,  Tollywood-TeluguStop.com

ఆయన దర్శకత్వం లో ప్రభాస్ సినిమా అంటే అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.అది నిజం కాకపోవచ్చు అని నిన్న మొన్నటి వరకు చాలా మంది అనుకున్నారు.

కానీ మారుతి ఇప్పటికే ప్రభాస్ హీరో గా సినిమా ను ఒక షెడ్యూల్ పూర్తి చేశాడు.షూటింగ్ చకచకా నిర్వహించేందుకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ పక్కా ప్లాన్ తో ముగించేశాడు.

రెండవ షెడ్యూల్ ఈ నెల రెండవ లేదా మూడవ వారం నుండి ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతుంది.ఇక ఈ సినిమా కోసం వేసిన రాజా డీలక్స్ మూవీ మహల్ సెట్ గురించి ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతుంది.

దాదాపు 15 కోట్ల రూపాయల ఖర్చు తో హైదరాబాదులోని ఒక ప్రముఖ ఏరియాలో ఈ థియేటర్స్ సెట్ వేయడం జరిగిందట.

Telugu Mahal Theater, Maruthi, Prabhas, Raja Deluxe, Salar, Upadte, Tollywood-Mo

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న పాత థియేటర్ల లో నడవకుండా మూతపడి ఉన్న ఎన్నో థియేటర్స్ ని పరిశీలించి చివరకు ఈ థియేటర్ యొక్క సెట్ నిర్మించారట.సినిమా థియేటర్ లు అప్పట్లో ఎలా ఉండేవి.ఎలాంటి పరిజ్ఞానం ఉపయోగించే వారు.

ఆ థియేటర్ మూతపడితే ఇప్పుడు ఎలా ఉంటుంది.ఇలా ప్రతి ఒక్క అంశాలను డీటెయిల్ గా పరిగణలోకి తీసుకొని సెట్ నిర్మించాలని తెలుస్తోంది.

ఈ సెట్టు సినిమా లో అత్యంత కీలకమైన సన్నివేశాల్లో కనిపిస్తుంది.కనుక కాస్త ఎక్కువగానే ఖర్చు చేశారు అనే టాక్‌ వినిపిస్తుంది.

సినిమా మేకింగ్‌ బడ్జెట్ లో దాదాపు 15% వరకు ఈ సెట్ కి ఖర్చు చేశారు అనే వార్తలు వస్తున్నాయి.మారుతి చిన్న బడ్జెట్ సినిమాలు చేసి మంచి పేరు దక్కించుకున్నాడు.

మొదటి సారి ఈ భారీ బడ్జెట్ సినిమాను తీస్తున్నాడు.అందుకు తగ్గట్లుగానే ఈ రాజా డీలక్స్ మూవీ మహల్ థియేటర్ సెట్ ని వేయించాడు.

సినిమా ప్రేక్షకులు ఆ మూవీ మహల్ సెట్ కోసం అయినా థియేటర్ కి వెళ్ళవచ్చు అంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube