అమితాబచ్చన్ వలన ప్రభాస్, గోపీచంద్ మల్టీ స్టారర్ ఆగిపోయిందంట

ఇండస్ట్రీలో డార్లింగ్ ప్రభాస్, గోపీచంద్ మంచి మిత్రులు అనే విషయం అందరికి తెలిసిందే.వీరిద్దరు కలిసి నటించిన మొదటి సినిమా వర్షం.

 Prabhas And Gopichand Multistarrer Movie Missed, Tollywood, Puri Jagannadh, Goli-TeluguStop.com

ఈ సినిమాలో గోపీచంద్ ప్రతినాయకుడుగా కనిపించాడు.కెరియర్ ఆరంభంలో విలన్ పాత్రలు చేసి మెప్పించిన గోపీచంద్ యజ్ఞం సినిమాతో టర్న్ తీసుకొని హీరోగా నిలబడ్డాడు.

ప్రస్తుతం యాక్షన్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు.అయితే చత్రపతి సినిమాతో ప్రభాస్ కి స్టార్ ఇమేజ్ వచ్చింది.

అయితే గోపీచంద్ కమర్శియల్ హీరోగా సక్సెస్ అయిన స్టార్ హీరో ఇమేజ్ ని మాత్రం అందుకోలేకపోయాడు.ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు.

ఇంకా గోపీచంద్ మాత్రం 20 నుంచి 30 కోట్ల మధ్య మార్కెట్ ఉన్న హీరోగానే ఉన్నాడు.ప్రభాస్ తో పూరీ జగన్నాథ్ ఎక్ నిరంజన్, బుజ్జిగాడు సినిమాలు తెరకెక్కించాడు.

ఇందులో ఎక్ నిరంజన్ కొంత వరకు ఒకే అనిపించుకుంది.

ఇక గోపీచంద్ తో కూడా గోలీమార్ అనే సినిమాని పూరీ తెరకెక్కించిన ఫ్లాప్ అయ్యింది.

అయితే గోలీమార్ తర్వాత ప్రభాస్, గోపీచంద్ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ చిత్రం ఒకటి చేయాలని పూరీ ప్లాన్ చేశాడు.దీనికోసం షోలే తరహాలో ఒక కాన్సెప్ట్ కూడా అనుకున్నాడు.

అయితే ఆ సమయంలో పూరీ జగన్నాథ్ కి బుడ్డా హోగా తెర బాప్ సినిమాతో అమితాబచ్చన్ ని దర్శకత్వం చేసే ఛాన్స్ రావడంతో అటు వైపు వెళ్ళిపోయాడు.తరువాత తెలుగులో మహేష్ బాబుతో బిజినెస్ మెన్, పవన్ కళ్యాణ్ కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలు చేస్తూ బిజీ అయిపోయాడు.

ఇక అదే సమయంలో గోపీచంద్ ఇమేజ్ డౌన్ అవుతూ వచ్చింది.ప్రభాస్ వరుస హిట్స్ తో తన ఇమేజ్ ని పెంచుకున్నాడు.దీంతో ఇద్దరి హీరోల మార్కెట్ విషయంలో వ్యత్యాసం రావడంతో పూరీ జగన్నాథ్ అనుకున్న సినిమా పట్టాలు ఎక్కలేదు.అలా ప్రభాస్, గోపీచంద్ కాంబో మూవీకి బ్రేక్ పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube