వారసుడు వర్సెస్‌ ఆదిపురుష్‌ బిగ్ క్ల్యాష్‌ తప్పదా?

Prabhas Adipurush Vs Vijay Varasudu For Sankranthi Next Year Prabhas , Adipurush , Vijay , Varasudu, Dil Raju, Tollywood

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్‌ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని వచ్చే ఏడాది జనవరి నెలలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.ఇన్నాళ్లు సినిమా విడుదల విషయమై అనుమానాలు నెలకొన్నాయి, కానీ దసరా కానుకగా అక్టోబర్ 2వ తారీఖున సినిమా యొక్క టీజర్ ని విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యుల అధికారికంగా ప్రకటించారు.

 Prabhas Adipurush Vs Vijay Varasudu For Sankranthi Next Year Prabhas , Adipurus-TeluguStop.com

టీజర్ విడుదల చేస్తున్నారంటే కచ్చితంగా సినిమా విడుదలకు రెడీ అన్నట్లుగానే సమాచారం అందుతుంది.విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ 90% పైగా పూర్తి అయింది అంటూ ఇటీవలే చిత్ర యూనిట్ సభ్యుల్లో ఒకరు మీడియా ద్వారా తెలియజేశారు.

కనుక సినిమా కచ్చితంగా సంక్రాంతికి విడుదల అవుతుంది అంటూ.ప్రభాస్ అభిమానులకు విందు భోజనాల ఈ సినిమా ఉంటుంది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమయంలోనే తమిళ్ సూపర్ స్టార్ విజయ్ నటించిన వారసుడు సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతుంది అంటూ అధికారికంగా ప్రకటించారు.తెలుగులో విజయ్ మొదటి సారి నటించిన సినిమా ఇదే దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు, వంశీ పైడిపల్లి సినిమాకు దర్శకుడు.

ఏ విధంగా చూసినా కూడా విజయ్ వారసుడు సినిమా తో సంక్రాంతికి కచ్చితంగా సందడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఒక వైపు ప్రభాస్ ఆదిపురుష్‌ సినిమా తో సందడి చేస్తాడని అభిమానులు ఎదురు చూస్తూ ఉంటే.

మరో వైపు సూపర్ స్టార్ విజయ్ సినిమా కూడా అదే సంక్రాంతికి వస్తుందని అధికారికంగా ప్రకటన రావడంతో బాక్సాఫీస్ వద్ద కచ్చితంగా భారీ యుద్ధ వాతావరణ నెలకొనే అవకాశం ఉంది అంటూ చాలా మంది విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఆ సమయంలో దిల్ రాజు ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తాడు, రెండు సినిమాలకు ఎలా న్యాయం చేస్తాడు అనేది చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube