ఈసారి కూడా 'ఆదిపురుష్‌' అప్‌డేట్ లేదని తేల్చేశారు

Prabhas Adipurush Movie Shooting And First Look Update News

టాలీవుడ్.బాలీవుడ్‌ పాన్ ఇండియా సూపర్‌ స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు నేడు.ఈ సందర్బంగా సోషల్‌ మీడియాలో సందడి మామూలుగా లేదు.అద్బుతమైన హీరో అంటూ ప్రభాస్ ను ఆకాశమే హద్దుగా ట్రెండ్‌ చేస్తున్నారు.ఉదయం నుండి కంటిన్యూగా ప్రభాస్‌ హ్యాష్‌ ట్యాగ్స్ ట్విట్టర్ లో ట్రెండ్డింగ్‌ లో ఉన్నాయి.రాధేశ్యామ్‌ సలార్‌ ఆదిపురుష్‌ మరియు స్పిరిట్‌ ఇలా అన్ని కూడా ట్రెండ్‌ లో నిలిచాయి.

 Prabhas Adipurush Movie Shooting And First Look Update News-TeluguStop.com

ప్రతి ఒక్క సినిమాకు సంబంధించిన అప్‌ డేట్‌ వచ్చింది కనుక ట్రెండ్‌ అయ్యింది అనుకుంటే పొరపాటే.ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్బంగా అభిమానులు చాలా ఆశించారు.

కాని ఏ ఒక్కటి కూడా ఈ సందర్బంగా విడుదల అయ్యిందే లేదు.బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్ గా నిలువబోతున్న ఆదిపురుష్‌ కు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ లేదా కనీసం మేకింగ్‌ వీడియో అయినా వస్తే బాగుండు అని అంతా అనుకున్నారు.

 Prabhas Adipurush Movie Shooting And First Look Update News-ఈసారి కూడా ఆదిపురుష్‌’ అప్‌డేట్ లేదని తేల్చేశారు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాని ఏది కూడా వర్కౌట్ కాలేదు.

ఆదిపురుష్‌ సినిమా ను హిందీలో రూపొందిస్తున్నారు.

పది పదిహేను భాషల్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్‌ సినిమా గా నిలిచిన బాహుబలి తర్వాత అంతకు మించిన సినిమా లను ప్రభాస్‌ చేస్తున్నాడు.

ప్రతి సినిమా కూడా ప్రభాస్ రేంజ్ ను పెంచేస్తుంది.ఇటీవల రాధే శ్యామ్‌ టీజర్ నెక్ట్స్‌ లెవల్‌ అన్నట్లుగా ఉంది.

అద్బుతమైన రాధే శ్యామ్‌ సినిమాకు సంబంధించిన టీజర్‌ వచ్చిన తర్వాత ఆదిపురుష్‌ సినిమా టీజర్ కూడా వచ్చి ఉంటే బాగుండేది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కాని ఆదిపురుష్‌ సినిమా కు సంబంధించిన ప్రతీది కూడా చాలా సీక్రెట్‌ మెయింటెన చేస్తున్నారు.సినిమా విడుదల వరకు కూడా మొత్తం సస్పెన్స్‌ గానే ఉంచే అవకాశాలు ఉన్నాయంటున్నారు.అతి త్వరలోనే ఆదిపురుష్‌ సినిమా నుండి కీలక అప్ డేట్‌ వస్తుందని అంటున్నారు.

సినిమా ను వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల చేయాలని భావిస్తున్నారు.

#Adipurush #Prabhas #Adipurush #Radeshyam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube