'ఆదిపురుష్‌' టార్గెట్‌ @75.. ఇంగ్లీష్‌ స్పానిష్‌ ఇంకా ఎన్నో

ప్రభాస్‌ బాలీవుడ్ ఎంట్రీ మూవీ ఆదిపురుష్‌ పాన్ ఇండియా మూవీగా కాకుండా పాన్ ఇంటర్నేషనల్ మూవీగా విడుదల అవ్వబోతుంది.బాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం 500 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా ను ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా 75 దేశాల్లో విడుదల చేయబోతున్నారట.

 Prabhas Adipurush Movie Release In 75 Countries-TeluguStop.com

ఇప్పటికే ఆ దేశాల్లో రిలీజ్ కన్ఫర్మ్‌ అయ్యింది.ఈ నెంబర్‌ విడుదల సమయంకు మరింత పెరిగినా ఆశ్చర్యం లేదు.

ఈ సినిమా ను 75 భాషల్లో విడుదల చేయడం కోసం గాను ఇంగ్లీష్ తో పాటు స్పానిష్‌ ఇంకా పలు ఫారిన్ భాషల్లో డబ్ చేయబోతున్నారు.అందుకు తగ్గట్లుగా కంటెంట్‌ ఉంటుందని మేకర్స్ అంటున్నారు.2500 కోట్ల వసూళ్లు లక్ష్యంగా ఈ సినిమా ను విడుదల చేస్తున్నామని అంటున్నారు.సినిమా కాస్త పాజిటివ్‌ రెస్పాన్స్ దక్కించుకున్నా.

 Prabhas Adipurush Movie Release In 75 Countries-ఆదిపురుష్‌’ టార్గెట్‌ @75.. ఇంగ్లీష్‌ స్పానిష్‌ ఇంకా ఎన్నో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇంటర్నేషనల్‌ స్క్రీన్స్ లో ఈ సినిమా ఆడిందంటే మూడు నాలుగు వేల కోట్ల వసూళ్లు కూడా నమోదు అవ్వడం పెద్ద కష్టం ఏమీ కాదని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు.

Telugu Adipurush, Adipurush In English, Baahubali, Film News, Prabhas-Movie

ఆదిపురుష్‌ సినిమా షూటింగ్ పునః ప్రారంభంకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ సినిమా లో ప్రభాస్ ను రాముడిగా దర్శకుడు చూపించబోతున్నాడు.రామాయణం ను కొత్త యాంగిల్‌ లో చూపించబోతున్నట్లుగా చెబుతున్న ఈ సినిమా టెక్నికల్‌ విషయంలో ఇప్పటి వరకు ఇండియన్‌ స్క్రీన్‌ పై రానటువంటి సినిమాగా చెబుతున్నారు.

దాదాపుగా 300 కోట్ల రూపాయలను వీఎఫ్‌ ఎక్స్ కోసం ఖర్చు చేస్తున్నట్లుగా చెబుతున్నారు.అద్బుతమైన విజువల్ వండర్ గా ఈ సినిమా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

ప్రస్తుతం సినిమా కు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను ఇంటర్నేషనల్ వేదికల పై జరుపుతూనే ఉన్నారు.వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల కాబోతున్న ఈ సినిమా ఇండియన్‌ సినిమా స్థాయిని ఆకాశమే హద్దు అన్నట్లుగా ప్రపంచ వ్యాప్తంగా విస్తరింపజేస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

#Prabhas #Baahubali #AdipurushIn #Adipurush

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు