ఆదిపురుష్‌ విడుదల తేదీ అధికారికంగా ప్రకటించారు

ప్రభాస్‌ రాముడిగా కనిపించబోతున్న ఆదిపురుష్‌ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు.హిందీలో ఓం రౌత్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ మొత్తం పూర్తి అయ్యింది.

 Prabhas Adipurush Movie Release Date Official Announcement, Adhipurush , Adhipur-TeluguStop.com

వచ్చే ఏడాది జనవరిలో షూటింగ్‌ ను షురూ చేసే అవకాశం ఉంది.టీ సిరీస్‌ వారు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్‌ సినిమాను 2022లో విడుదల చేస్తాం అంటూ గతంలోనే దర్శకుడు ప్రకటించాడు.

ఇప్పుడు తేదీతో సహా క్లారిటీ ఇచ్చాడు.సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా దర్శకుడు ఓం రౌత్‌ ఏదో సెంటిమెంట్‌ అన్నట్లుగా ఉదయం 7.11 కు విడుదల చేయడం ప్రకటించడం చేస్తున్నాడు.విడుదల తేదీ విషయంలో కూడా అదే జరిగింది.ఆదిపురుష్‌ సినిమాను 11.08.2022లో విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా అనౌన్స్‌మెంట్‌ వచ్చింది.

ఇంకా షూటింగ్‌ ప్రారంభం కాని ఒక సినిమా విడుదల తేదీని ఇంత ముందుగా ప్రకటించడం అంటే మామూలు విషయం కాదు.నిజంగా ఎంతో ఘట్స్‌ ఉంటే కాని ఇంత భారీ సినిమాను విడుదల చేసేందుకు డేట్‌ ను ప్రకటించరు.దర్శకుడు ఓం రౌత్‌ పూర్తి నమ్మకంతో ఈ సినిమాను ఆ తేదీలో విడుదల చేసేందుకు సిద్దం చేశారు.

అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటున్న ఆదిపురుష్‌ రామాయణం ఇతివృత్తాంతం నేపథ్యంలో రూపొందుతుంది.అయితే ఈసారి రామాయణంను ప్రేక్షకులు విభిన్నంగా చూడబోతున్నారు.రాముడు అంటే బాణం పట్టుకుని ఉండకుండా ఈసారి కండలు తిరిగిన వ్యక్తిలా కనిపించబోతున్నాడు.ఇక ఈ సినిమాలో సీత పాత్రకు అనన్య పాండేను ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఇదే సమయంలో సినిమా సంగీత దర్శకుడు ఇతర విషయాలను ఎప్పుడు ప్రకటిస్తారు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.రాధేశ్యామ్‌ పూర్తి అయిన వెంటనే ఆదిపురుష్‌ షూటింగ్‌ లో ప్రభాస్‌ పాల్గొనబోతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube