'ఆదిపురుష్‌' హీరోయిన్‌ అప్‌ డేట్‌ రాబోతుంది

ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓమ్‌ రౌత్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ఆదిపురుష్‌.ఈ సినిమా రూ.500 కోట్లతో భారీ బడ్జెట్‌ తో విజువల్‌ వండర్ గా రూపొందుతున్న విషయం తెలిసిందే.ఈ సినిమాతో పూర్తి స్థాయి హిందీ నటుడిగా ప్రభాస్ మారబోతున్నాడు.

 Prabhas Adipurush Movie Heroine News  Prabhas, Om Rauth, Aadhipurush, Bollywood-TeluguStop.com

ఇప్పటికే ఈయన నటించిన బాహుబలి మరియు సాహో సినిమాలు బాలీవుడ్ లో సంచలనాత్మక విజయాన్ని సాధించాయి.ఇది కూడా ఖచ్చితంగా బాలీవుడ్ వర్గాల వారిని మరియు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చాలా నమ్మకంగా ఉన్నారు.

ఇక ఈ సినిమాకు సంబంధించిన విషయాలను ఇప్పటికే దర్శకుడు బ్యాక్‌ టు బ్యాక్‌ ఇచ్చాడు.ఇక ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటించబోతున్నారు అనే విషయంలో గత కొన్ని రోజులుగా సస్పెన్స్ నెలకొంది.

ఆ విషయమై కూడా అతి త్వరలోనే ఈ చిత్ర యూనిట్ సభ్యులు స్పష్టత ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం అందుతోంది.

విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ని ఈ సినిమాకి ఎంపిక చేశారట.

ఆమెకు సంబంధించిన అధికారిక ప్రకటన ఒకటి రెండు వారాల్లో చేసే అవకాశం ఉంది.ఇక ఈ సినిమా షూటింగ్ జనవరి లో ప్రారంభించాలని భావిస్తున్నారు.

మూడు నెలల్లో పూర్తి చేసి సినిమాను 2022 వ సంవత్సరంలో కచ్చితంగా విడుదల చేయాలని దర్శకుడు భావిస్తున్నాడు.ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న రాధే శ్యామ్‌ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ఆదిపురుష్‌ షూటింగ్ లో జాయిన్ అవుతాడు.

దర్శకుడు ఓమ్ రౌత్‌ ప్రభాస్ డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు.ప్రస్తుతం స్ర్కిప్ట్‌ విషయం మరియు ఇతరత్రా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఓమ్‌ రౌత్‌ బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఈ సినిమా రామాయణం ఇతి వృత్తంలో రూపొందుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube