రాముడిగా డార్లింగ్ ప్రభాస్ లుక్ వైరల్... స్పందించిన ఓంరౌత్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమా షూటింగ్ లో ఉన్నాడు.ఈ సినిమా తర్వాత బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో మైథలాజికల్ కథాంశంతో ఆది పురుష్ సినిమా చేయబోతున్నాడు.

 Prabhas Adipurush Movie Fan-made Poster Goes Viral, Tollywood, Bollywood, Darlin-TeluguStop.com

ఈ సినిమాలో శ్రీరాముడుగా ప్రభాస్ కనిపించబోతున్నాడు.రామాయణంలో కీలక కథని తీసుకొని దానిని ప్రెజెంట్ నేటివిటీకి కనెక్ట్ చేస్తూ ఈ సినిమాని దర్శకుడు ఓ రౌత్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది.

ప్రముఖ నిర్మాణ సంస్థ టి-సిరీస్ 250 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని విజువల్ గ్రాండియర్ గా త్రీడీ టెక్నాలజీలో ఆవిష్కరించడానికి సిద్ధం అవుతుంది.వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది.

ఇదిలా ఉంటే ఇప్పటికే బాహుబలిగా పవర్ ఫుల్ క్షత్రియుడుగా కనిపించిన ప్రభాస్ ని అతని ఫ్యాన్స్ శ్రీరాముడుగా కూడా ఆవిష్కరించే ప్రయత్నం ముందుగానే చేస్తున్నారు.

శ్రీరాముడు పాత్రలో ప్రభాస్ ఎలా ఉండబోతున్నాడు అనే విషయాన్ని ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ తో ఇప్పటికే చాలా మంది ఆవిష్కరించారు.

అయితే తాజాగా ఓ అభిమాని ప్రభాస్ ని శ్రీరాముడు పాత్రలో డిజైన్ చేసి యానిమేషన్ లుక్ ని రిలీజ్ చేశాడు.ఈ లుక్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ శ్రీరాముడు లుక్ లో ఉన్న ప్రభాస్ యానిమేషన్ ఇమేజ్ ని విపరీతంగా షేర్స్ చేస్తూ ట్రెండ్ చేశారు.ఇది మెల్లగా దర్శకుడు ఓ రౌత్ దగ్గరకి కూడా చేరింది.

ఈ పోస్టర్ చూసిన చిత్ర దర్శకుడు ఓం రౌత్ దీనిపై స్పందిస్తూ ఈ లుక్‌ చూసి స్టన్‌ అయ్యాను, మీకు చాలా శక్తి ఉంది అంటూ కామెంట్ చేశాడు.ఈ లుక్ లో ప్రభాస్ శ్రీరాముడు గా సముద్ర తీరాన సిక్స్ ప్యాక్ బాడీతో సీరియస్ లుక్ లో కనిపిస్తున్నాడు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube