ఆల్బమ్ తోనే హైప్ పెంచేస్తున్న 'ఆదిపురుష్' టీమ్!

ప్రభాస్( Prabhas ) హీరోగా, కృతి సనన్ హీరోయిన్ గా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”ఆదిపురుష్”.ఈ పీరియాడిక్ వండర్ కోసం ఆడియెన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.

 Prabhas Adipurush Album Making Solid Hype, Prabhas, Adipurush, Ram Sita Ram , Bo-TeluguStop.com

తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమా మొదట్లో నెగిటివ్ కామెంట్స్ రాగా టీమ్ చేస్తున్న ప్రమోషన్స్ కారణంగా ఇప్పుడిప్పుడే హైప్ భారీగా తెచ్చుకుంది.

వచ్చే నెల గ్రాండ్ రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ సినిమా నుండి వరుసగా అప్డేట్ లను ఇస్తూ ఆడియెన్స్ లో మరింత ఇంట్రెస్ట్ కలిగించేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా నుండి రెండు పాటలు ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేయగా రెండు కూడా యునామినస్ రెస్పాన్స్ అందుకుని చార్ట్ బస్టర్ గా నిలిచాయి.దీంతో మేకర్స్ ఆల్బమ్ తోనే హైప్ పెంచేస్తున్నారు.

Telugu Adipurush, Adipurush Album, Jai Shri Ram, Kriti Sanon, Om Raut, Prabhas,

జై శ్రీరామ్ సాంగ్ ( Jai Shri Ram )ముందుగా రిలీజ్ కాగా ఈ సాంగ్ కు ఆడియెన్స్ ను అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.ఇక నిన్న రిలీజ్ చేసిన రామ్ సీతారామ్ సాంగ్ ( Ram Sita Ram )కూడా మరో రేంజ్ లో అలరిస్తుంది.ఈ రెండు సాంగ్స్ తో ఆల్బమ్ ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది అని అర్ధం అవుతుంది.ఈ సినిమాలో మొత్తం 5 పాటలు ఉండగా ఇప్పటికే విడుదల అయిన రెండు కూడా బిగ్గెస్ట్ హిట్ గానే నిలిచాయి.

Telugu Adipurush, Adipurush Album, Jai Shri Ram, Kriti Sanon, Om Raut, Prabhas,

ఇక మిగిలిన సాంగ్స్ కూడా ఇదే రేంజ్ లో అలరించే అవకాశం కనిపిస్తుంది.ఆ మూడు సాంగ్స్ కూడా రిలీజ్ చేస్తే ఆడియెన్స్ లో ఈ సినిమాపై క్రేజ్ మరో లెవల్ కు చేరుకునే అవకాశం ఉంది.ఇక తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమాను టి సిరీస్ సంస్థ, రిట్రో ఫైల్స్ 500 కోట్ల భారీ బడ్జెట్ తో సంయుక్తంగా నిర్మించారు. జూన్ 16న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube