ఆ ఒక్క రోజే ప్రభాస్ అయిదు సినిమాల కానుకలు

ప్రభాస్‌ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు నాలుగు మాత్రమే కదా అయిదు సినిమాల కానుకలు ఎలా అనుకుంటున్నారా.అసలు విషయం ఏంటీ అంటే ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్‌, సలార్‌, ఆదిపురుష్ మరియు ప్రాజెక్ట్‌ కే సినిమాలతో పాటు బాలీవుడ్‌ లో ఈయన నటించబోతున్న సినిమా కు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుంది.

 Prabhas 5 Movies First Look And Teasers For Birthday-TeluguStop.com

గత కొన్ని నెలలుగా ప్రభాస్‌ బాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ సిద్దార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్న విషయం తెల్సిందే కదా.ఆ సినిమాకు సంబంధించిన అప్‌ డేట్‌ ను ప్రభాస్ పుట్టిన రోజు సందర్బంగా అక్టోబర్ లో అనౌన్స్‌ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.ప్రభాస్‌ ప్రస్తుతం చేస్తున్న సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా వరుసగా సినిమాలను చేస్తూను భారీగా చేయబోతున్నాడు.

Telugu Aadipurush, Film News, Movie News, News About Film News, Prabhas, Radheshyam-Movie

రాధే శ్యామ్‌ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది.ఒకటి రెండు రోజుల్లో సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే తేదీని ప్రకటిస్తారనే వార్తలు వస్తున్నాయి.ఆ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

 Prabhas 5 Movies First Look And Teasers For Birthday-ఆ ఒక్క రోజే ప్రభాస్ అయిదు సినిమాల కానుకలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక సలార్‌ టీజర్ ను ప్రభాస్ బర్త్‌ డే సందర్బంగా విడుదల చేయబోతున్నారు.ఆదిపురుష్‌ లోని ప్రభాస్ లుక్ ను ఆయన పుట్టిన రోజు సందర్బంగా విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

అంతే కాకుండా ప్రాజెక్ట్‌ కే సినిమా లో ప్రభాస్ పాత్ర గురించి బర్త్‌ డే సందర్బంగా అనౌన్స్ చేస్తారని చెబుతున్నారు.ఇలా మొత్తం అయిదు సినిమా ల అప్ డేట్‌ లతో ఆ వారం మొత్తం కూడా సందడి సందడిగా ఉంటుందని ప్రభాస్ అభిమానులు నమ్మకంతో ఉన్నారు.

వరుసగా సినిమాలు చేస్తున్న ప్రభాస్‌ ఇవి మాత్రమే కాకుండా వచ్చే ఏడాది రెండు మూడు సినిమాలు కొత్తవి కూడా కమిట్ అవుతాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

#NewsAbout #Radheshyam #Aadipurush #Prabhas

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు