ఊరించి ఉసూరుమనిపించిన రాధేశ్యామ్  

Prabhas 20 Radhe Shyam Did Not Match Expectations, Prabhas, Prabhas 20, Radhe Shyam, Pooja Hegde, Tollywood News - Telugu Pooja Hegde, Prabhas, Prabhas 20, Radhe Shyam, Tollywood News

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీకి సంబంధించిన అప్‌డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన ఫ్యాన్స్‌ను ఎట్టకేలకు చిత్ర యూనిట్ కరుణించింది.జూలై 10న ఉదయం 10 గంటలకు ప్రభాస్ 20వ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ను కూడా రిలీజ్ చేస్తామని ప్రకటించిన చిత్ర యూనిట్, అన్నట్లుగా ఈ ఉదయం సినిమా టైటిల్‌తో పాటు ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

 Prabhas 20 Radhe Shyam Pooja Hegde

ముందునుండి ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న ‘రాధేశ్యామ్’ టైటిల్‌నే చిత్ర యూనిట్ ఫైనల్ చేసింది.ఇక ఫస్ట్ లుక్ పోస్టర్‌గా ప్రభాస్, పూజా హెగ్డేల రొమాంటిక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.

దీంతో ఈ పోస్టర్‌కు ప్రభాస్ ఫ్యాన్స్ పట్టం కడుతున్నారు.పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ వింటేజ్ లుక్‌ను మనకు ఈ పోస్టర్‌లో చూపెట్టారు.

ఊరించి ఉసూరుమనిపించిన రాధేశ్యామ్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇక ఈ సినిమాలో పూజా హెగ్డేను మరింత అందంగా మనకు చూపించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

కాగా ఇటలీలో 80లలో జరిగే కథగా మనకు ఈ సినిమాను చూపించనున్నట్లు పోస్టర్ చూస్తే తెలుస్తోంది.

ప్రభాస్ పర్ఫార్మె్న్స్‌తో రాధేశ్యామ్ మరో లెవెల్‌కు వెళ్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఇక జిల్ ఫేం రాధాకృష్ణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాయి.

కాగా ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.మరి ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

#Prabhas 20 #Radhe Shyam #Prabhas #Pooja Hegde

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Prabhas 20 Radhe Shyam Pooja Hegde Related Telugu News,Photos/Pics,Images..