ఆగస్టుకు మార్చిన ప్రభాస్.. డౌటే అంటోన్న ఫ్యాన్స్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయాలని ప్రభాస్ చూస్తున్నాడు.

 Prabhas 20 First Look To Release In August, Prabhas, Prabhas 20, Pooja Hegde, Ra-TeluguStop.com

కాగా ప్రభాస్ 20వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే ఈ ఫస్ట్ లుక్‌ను రీసెంట్‌గా జూన్ నెలలో రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ తెలిపినా ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్థితుల కారణంగా అది వీలు కాలేదు.

కాగా ఇక ఇప్పట్లో ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేస్తుందో లేదో అని అందరూ అనుకుంటున్న సమయంలో, అక్టోబర్ నెలలో ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఖచ్చితంగా ఉండబోతుందనే వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.అక్టోబర్ 23వ తేదీన ప్రభాస్ పుట్టినరోజు ఉండటంతో, ఆ రోజు ఈ సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ కూడా రిలీజ్ చేస్తారనే వార్త చక్కర్లు కొడుతోంది.

అందుకే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను రివీల్ చేయలేదని పలువురు అంటున్నారు.

ఏదేమైనా గతకొంత కాలంగా ఈ సినిమా అప్‌డేట్ విషయంలో ఊరిస్తూ వస్తున్న చిత్ర యూనిట్, ఇప్పుడు మరోసారి తమను మోసం చేస్తారా లేక నిజంగానే రిలీజ్ చేస్తారా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఏదేమైనా ఈ ప్రశ్న ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ నెలకొంది.మరి ఈ విషయంపై చిత్ర యూనిట్ అఫీషియల్ ప్రకటన ఇచ్చే వరకు ఆగాల్సిందే.

ఇక ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోండగా, రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube