కొత్త అవతారమెత్తిన పూజా.. ఏం చేస్తుందో తెలుసా?  

Prabhas 20 Lockdown - Telugu Chef, Lockdown, Pooja Hegde, Prabhas 20, Tollywood News

టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిన పూజా హెగ్డే, ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది.కాగా లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అయిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ, తన ఫ్యా్న్స్‌తో అడపాదడపా మాట్లాడుతోంది.

 Prabhas 20 Lockdown

అయితే లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన పూజా, ఇంట్లో సరికొత్త అవతారమెత్తి అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది.

ఇటీవల వంట మనిషిగా మారిన పూజా సరికొత్త వంటకాలను నేర్చుకుని వాటిని కుటుంబ సభ్యుల కోసం వండి పెడుతోంది.

కొత్త అవతారమెత్తిన పూజా.. ఏం చేస్తుందో తెలుసా-Gossips-Telugu Tollywood Photo Image

ఇటీవల స్వీట్ హల్వా మరియు పిజ్జా తయారు చేసిన పూజా, తన తండ్రి పుట్టినరోజున తానే ప్రత్యేకంగా ఓ కేకును కూడా తయారు చేసి వారి మనసు గెలుచుకుంది.కేవలం వంటకాలే కాకుండా గిటార్ వాయించడం కూడా నేర్చుకున్నానంటూ గర్వంగా చెబుతున్న పూజా తాను చెఫ్‌గా మారడం ఎంతో సంతోషాన్నిచ్చిందని చెప్పుకొచ్చింది.

కాగా తాజాగా ఓ కొత్తరకం వంటకాన్ని తయారు చేసిన పూజా, దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.తన నాన్నమ్మతో కలిసి దిగినో ఓ ఫోటోను కూడా ఈ వంటకంతో పెట్టడంతో ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

సినిమాల్లో టాప్ హీరోయిన్ అయినప్పటికీ, తన ఇంట్లో తానొక మామూలు అమ్మాయినే అంటోంది పూజా.ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన ప్రభాస్ 20వ చిత్రంలో నటిస్తున్న ఈ బ్యూటీ త్వరలోనే షూటింగ్‌ను తిరిగి స్టార్ట్ చేసేందుకు రెడీ అయ్యింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Prabhas 20 Lockdown Related Telugu News,Photos/Pics,Images..

footer-test