ప్రభాస్ పేరు చెప్పగానే జడుసుకున్న ఆంటీ!  

Prabhas 20 Bhagyasree - Telugu Bhagyasree, Pooja Hegde, Prabhas, Prabhas 20

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి తనదైన మార్క్ వేసుకునేందుకు రెడీ అవుతున్నాడు.

 Prabhas 20 Bhagyasree

సాహో తరువాత వస్తున్న చిత్రం కావడంతో ప్రభాస్ 20వ చిత్రంపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాలో ప్రభాస్ ఎలాంటి పాత్రలో నటిస్తున్నాడనే అంశంపై ఇండస్ట్రీ వర్గాల్లో పలు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ సినిమాలో ప్రభాస్ తల్లి పాత్రలో ఒకప్పటి బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ నటిస్తోన్న సంగతి తెలిసిందే.ఇటీవల జార్జియా షెడ్యూల్‌లో పాల్గొన్న ఆమె ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.

ప్రభాస్ పేరు చెప్పగానే జడుసుకున్న ఆంటీ-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఈ సినిమాలో తనను ఎంపిక చేసినప్పుడు ప్రభాస్‌తో సినిమా అనగానే భయపడ్డాడని, ఆయనొక ఇంటర్నేషనల్ స్టార్ అని తన పాత్ర ఈ సినిమాలో ఎలా ఉంటుందో అని ఆమె సందేహపడిందట.కానీ షూటింగ్ సమయంలో ఈ చిత్ర యూనిత్ తనను బాగా చూసుకున్నారని ఆమె తెలిపింది.

ఇక ప్రభాస్‌తో షూటింగ్ సమయంలో తాను చాలా ఎంజాయ్ చేశానని, అసలు ఆయనలాంటి మంచి వ్యక్తిని చాలా అరుదుగా చూశానని ఆమె చెప్పుకొచ్చింది.ప్రభాస్‌తో నటించడం చాలా సంతోషంగా ఉందని ఆమె తెలిపింది.

మొత్తానికి ప్రభాస్‌తో సినిమా చేయడం ఆమెకు మరిచిపోలేని జ్ఞాపకంగా ఉంటుందని భాగ్యశ్రీ చెప్పుకొచ్చింది.ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా జిల్ ఫేం రాధాకృష్ణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test