ప్రభాకర్ కొడుకు నాటునాటు డ్యాన్స్ చూశారా.. ఆ విషయంలో బెటర్ అంటూ?

ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ గురించి సోషల్ మీడియా వేదికగా ఊహించని స్థాయిలో ట్రోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ మధ్య కాలంలో ఏ నటుడిపై జరగని స్థాయిలో చంద్రహాస్ పై ట్రోలింగ్ జరగగా ప్రభాకర్ మాత్రం ట్రోలింగ్ కూడా ఒక విధంగా మంచిదే అని అభిప్రాయం వ్యక్తం చేశారు.

 Prabhakar Son Chandrahas Natu Natu Dance Video Goes Viral In Social Media , Atti-TeluguStop.com

కొంతమంది నెటిజన్లు చంద్రహాస్ ఫేమస్ కావడం కోసమే ఆ విధంగా ప్రవర్తించాడని కామెంట్లు చేస్తున్నారు.

అయితే చంద్రహాస్ నాటునాటు పాటకు డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రభాకర్ దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకుని చంద్రహాస్ ఈ వీడియో చేశారు.ఈ వీడియో ఓల్డ్ వీడియో అయినప్పటికీ చంద్రహాస్ పై వస్తున్న ట్రోల్స్ వల్ల ఈ వీడియో వైరల్ అవుతోంది.

అయితే ఈ వీడియోలో చంద్రహాస్ బాగా డ్యాన్స్ చేశాడని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

పబ్లిక్ లో కనిపించే సమయంలో చంద్రహాస్ ఓవర్ యాక్షన్ తగ్గిస్తే అతనికి మంచి భవిష్యత్తు ఉంటుందంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

వినయం తోడుంటే చంద్రహాస్ కు విజయాలు దక్కుతాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.ప్రతిభతో పాటు ప్రవర్తన ముఖ్యమని ప్రతిభకు ప్రవర్తన తోడైతే విజయం దక్కుతుందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

చంద్రహాస్ కు కొన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయని మరి కొందరు చెబుతున్నారు.ట్రోల్స్ వచ్చిన తర్వాతే ఈ వీడియోను ఎక్కువమంది చూశారు.హీరోగా చంద్రహాస్ సక్సెస్ అవుతారో లేదో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.నాటు నాటు సాంగ్ వీడియోలో డ్యాన్స్ మాత్రం నిజంగా బాగుందని నెటిజన్లు చెబుతున్నారు.సీరియల్ నటుడు ప్రభాకర్ సపోర్ట్ ఉండటంతో చంద్రహాస్ సినిమాలలో సక్సెస్ సాధించడం కష్టం కాదని కొంతమంది నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube