తాడిపత్రిలో మరోసారి జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డి..!!

అనంతపురం జిల్లా రాజకీయాలలో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అదే రీతిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దరెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ అయింది.మున్సిపల్ చైర్మన్ పదవి హోదాలో ఉన్న ప్రభాకర్ రెడ్డి.

 Prabhakar Reddy Vs Mla Kethireddy Peddireddy Once Again In Tadipatri Prabhakar R-TeluguStop.com

నిన్న ఉదయం పదిన్నర గంటల టైం లో మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఇక అదే సమయంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మున్సిపల్ అధికారులతో కరోనా థర్డ్ వేవ్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు.

దీంతో మున్సిపల్ అధికారులు ఎమ్మెల్యే కార్యక్రమానికి వెళ్లటం తో మున్సిపల్ చైర్మన్ హోదాలో ప్రభాకర్ రెడ్డి నిర్వహించిన సమావేశానికి రాలేకపోయారు.

ఎమ్మెల్యే ప్రోగ్రాం అయిన అనంతరం మున్సిపల్ అధికారులు ఎవరికి వారు తమ ఇళ్లకు వెళ్లిపోయారు.

దీంతో అర్ధరాత్రి వరకు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కార్యాలయంలోనే ఉండి అధికారుల కోసం వేచి చూశారు.అదే రీతిలో పోలీసులకు మున్సిపల్ అధికారులు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు.

అయితే ఎట్టకేలకు మున్సిపల్ అధికారులుమొత్తం అందరూ కార్యాలయానికి రావటంతో జెసి లేచి వారందరికీ తండాలు పెట్టాడు.అంత మాత్రమే కాక తన ఆదేశాలను పట్టించుకోకుండా ఉండటంతో 26 మంది సిబ్బందికి నోటీసులు జారీ చేస్తున్నట్లు జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు.

కమిషనర్ సెలవు పెట్టి వెళ్లిపోవటం తన వచ్చేవరకు కార్యాలయంలోనే ఉంటాను అంటూ భోజనం అక్కడే చేసి అక్కడే నిద్ర పోయారు జేసీ ప్రభాకర్ రెడ్డి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube