పీఆర్ టీమ్ సలహాతో బట్టలు సైజు తగ్గించిన హీరోయిన్   PR Team Behind Top Actress’s Glamorous Public Appearances     2016-12-20   22:11:55  IST  Raghu V

తాను ఒక స్టార్ హీరోయిన్. సినిమాల్లో ఎంత గ్లామరస్ గా కనిపించినా, బయట పబ్లిక్ ఫంక్షన్స్ లో మాత్రం మామూలుగా, నిండుగా ఉండే బట్టలే వేసుకునేది. కాని ఈమధ్య తన డ్రెస్సింగ్ స్టయిల్ లో చాలా మార్పు వచ్చింది. బయట ఫంక్షన్స్ లో కూడా బట్టల సైజు తగ్గుతూ వస్తోంది. పబ్లిక్ లో కూడా బాగా గ్లామరస్ గా తయారయ్యి వస్తోంది. ఎందుకు సడెన్ గా మార్పు ?

ఆరాతీస్తే తెలిసింది తన పీఆర్ టీమ్ సలహాలు పాటిస్తోందట ఆ బ్యూటి. గత ఏడాది వచ్చిన ఒక బ్లాక్ బస్టర్ తరువాత తనకు అన్ని పెద్ద సినిమా అవకాశాలే వస్తాయని అనుకుందట. కాని అలా జరగట్లేదు. తెలుగు అగ్రహీరోలతో ఇప్పట్లో ఒక్క సినిమా లేదు తనకి. అటు బాలివుడ్ లో అవకాశాలు చేతిదాకా వచ్చి మరొకరి చేతిలో పడుతున్నాయి.

ఇలాగైతే బాలివుడ్ లో కష్టం, అవార్డు ఫంక్షన్స్ లో, ప్రైవేట్ ఈవెంట్స్ లో మరింత ట్రెండిగా కనిపిస్తే తప్ప, బాలివుడ్ దర్శకనిర్మాతల దృష్టిని ఆకర్షించడం కష్టం అని పీఆర్ టీమ్ వారు సలహాలు ఇచ్చారట. దాంతో కొత్తరకమైన బట్టలు తన బ్యాగ్ లోకి వచ్చాయి. అవి రాను రాను సైజులో చిన్నగా అవుతున్నాయి.