సైలెంట్ గా మొదలుపెట్టిన పవర్ స్టార్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల లిస్ట్ పెరుగుతూ పోతుంది.మొన్నటిదాకా హరి హర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్ మాత్రమే చేయాల్సి ఉండగా లేటెస్ట్ గా ఓ తమిళ సినిమా రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు పవర్ స్టార్.

 Powerstar Pawan Kalyan Started Vinodaya Seetham Telugu Remake, Pawan Kalyan,powe-TeluguStop.com

సముద్రఖని డైరక్షన్ లో తమిళంలో తెరకెక్కిన వినోదయ సీతం సినిమా తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు.ఈ సినిమాను తెలుగులో కూడా సముద్రఖని డైరెక్ట్ చేస్తుండగా రచనా సహకారం త్రివిక్రం అందిస్తున్నట్టు తెలుస్తుంది.

అంతేకాదు ఈ సినిమా నిర్మాణంలో కూడా త్రివిక్రం పాలు పంచుకుంటున్నాడట.

ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ 20 రోజులు డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

ఈ మూవీలో పవన్ కళ్యాణ్ తో పాటుగా మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ కూడా నటిస్తాడని తెలుస్తుంది.పవన్, సాయి తేజ్ ఇద్దరు కలిసి మెగా, పవర్ స్టార్ ఫ్యాన్స్ ని ఖుషి చేయనున్నారు.

తమిళంలో ఆడియెన్స్ మెప్పు పొందిన వినోదయ సీతం తెలుగులో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.ఈ సినిమా శుక్రవారం సైలెంట్ గా స్టార్ట్ అయ్యింది. పెద్దగా హడావిడి ఏమి లేకుండానే కొద్దిపాటి చిత్రయూనిట్ తో ఈ సినిమా ముహుర్త కార్యక్రమాలను పూర్తి చేశారని తెలుస్తుంది.2023 సమ్మర్ కి ఈ మూవీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube