వకీల్ సాబ్ కు సెన్సార్ షాక్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరాం డైరక్షన్ లో వస్తున్న సినిమా వకీల్ సాబ్.ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మించారు.

 Powerstar Pawan Kalyan Vakeel Saab Censor Completed, Vakeel Saab, Pawan Kalyan,v-TeluguStop.com

ఏప్రిల్ 9న రిలీజ్ అవుతున్న ఈ సినిమా సోమవారం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.సెన్సార్ టీం సినిమా చూసి షాక్ అయ్యారని టాక్.

బాలీవుడ్ పింక్ సినిమాకు రీమేక్ గా వచ్చిన వకీల్ సాబ్ సినిమా మూల కథ అదే అయినా పవర్ స్టార్ ఇమేజ్ కు తగినట్టుగా కథ మార్చినట్టు తెలుస్తుంది.

ముగ్గురు అమ్మాయిలకు న్యాయం చేయడం కోసం వకీల్ ఏం చేశాడు అన్నది సినిమా కథ.సినిమా ఇప్పటికే ట్రైలర్ తో అంచనాలు పెంచగా రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవర్ స్టార్ ఫ్యాన్స్ జోరు చూస్తుంటే సినిమా సంచలనం సృష్టించడం పక్కా అనేలా ఉంది.వకీల్ సాబ్ సెన్సార్ నుండి యు/ఏ సర్టిఫికెట్ అందుకుంది.

సెన్సార్ వారు సినిమా చూసి పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చినట్టు తెలుస్తుంది.థమన్ మ్యూజిక్ అందిస్తున్న వకీల్ సాబ్ సినిమాలో సాంగ్స్ కూడా అదిరిపోయాయి.

ఈమధ్య వరుస సూపర్ హిట్లతో సూపర్ ఫాం లో ఉన్న థమన్ పవర్ స్టార్ కు అదిరిపోయే మ్యూజిక్ అందించాడు.అంతేకాదు థమన్ బిజిఎం కూడా సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube