ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లనున్న నితిన్ పవర్ పేట

యూత్ స్టార్ నితిన్ ప్రస్తుతం మంచి జోష్ మీద ఉన్నాడు.2020లో టాలీవుడ్ లో సూపర్ హిట్ కొట్టిన ఒకే ఒక్క హీరోలు సూపర్ స్టార్ మహేష్, నితిన్ మాత్రమే.కెరియర్ లో భీష్మ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి అత్యధిక కలెక్షన్ కూడా సొంతం చేసుకున్నాడు.ఇదే సమయంలో వరుసగా సినిమాలు లైన్ లో పెట్టేశాడు.

 Powerpet Movie Will Start In February, Tollywood, Telugu Cinema, Rang De Movie,-TeluguStop.com

ప్రస్తుతం నితిన్ ఖాతాలో నాలుగు సినిమాలు ఉన్నాయి.వాటిలో రెండు సినిమాలు షూటింగ్ చివరి దశకి వచ్చేశాయి.

మరో రెండు సినిమాలు సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ అవుతున్నాయి.రంగ్ దే తో మరోసారి రొమాంటిక్ హీరోగా సందడి చేయడానికి రెడీ అవుతూనే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ భిన్నమైన క్యారెక్టర్ లో కనిపిస్తున్నాడు.

అలాగే మేర్లపాక గాంధీ దర్శకత్వంలో అంధాదున్ రీమేక్ కోసం మొదటి సరిగా అంధుడు పాత్రలో నితిన్ నటించబోతున్నాడు.

ఈ మూడు సినిమాలు ఒక ఎత్తైతే కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కబోయే పవర్ పేట మరో ఎత్తు.

ఈ సినిమాలో నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలో నితిన్ కనిపించబోతున్నాడు.దానికి తోడు ఇందులో భిన్న వయస్సు ఉన్న పాత్రలలో మొదటి సారి తనపై తాను ప్రయోగం చేసుకుంటున్నాడు.

అందులో ఒకటి వృద్ధుడు పాత్ర కూడా ఉంది.ఈ పాత్ర కోసం తన ఆహార్యం పూర్తిగా మార్చుకోవడానికి రెడీ అవుతున్నాడు.

ఇదిలా ఉంటే నితిన్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కబోతుంది.ఇక ఈ సినిమాని ఫిబ్రవరిలో సెట్స్ పైకి తీసుకొని వెళ్ళడానికి నితిన్ సిద్ధం అవుతున్నాడు.

ఇప్పటికే అందుకు తగ్గట్లు ప్రీప్రొడక్షన్ వర్క్ మొత్తం దర్శకుడు కృష్ణ చైతన్య టీం చేస్తుంది.ఇందులో కూడా నితిన్ కి జోడీగా కీర్తి సురేష్ నటిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube