‘పవర్‌స్టార్‌’ను ‘గోకులంలో సీత’ కు లింక్‌ పెట్టిన వర్మ  

Power Star, Ram Gopal Varma, Gokulam lo Seetha, July24th, ATT, Power Star Movie, Release date - Telugu Att, Gokulam Lo Seetha, July24th, Power Star, Power Star Movie, Ram Gopal Varma

రామ్‌ గోపాల్‌ వర్మ స్పీడ్‌ మామూలుగా లేదు.ఒకొక్కరు సినిమాలను ఏడాది పాటు తీస్తుంటే వర్మ మాత్రం రెండు మూడు వారాల్లో చుట్టేస్తున్నాడు.

 Power Star Release Date July 24th

ఇటీవలే పవర్‌ స్టార్‌ చిత్రాన్ని మొదలు పెట్టిన వర్మ ఆ సినిమా షూటింగ్‌ను దాదాపుగా పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది.ఈమద్య కాలంలో కరోనా కారణంగా షూటింగ్స్‌ చేసేందుకు చిత్ర యూనిట్‌ సభ్యులు వెనుకాడుతుంటే వర్మ మాత్రం సినిమాలకు సినిమాలు పూర్తి చేస్తున్నాడు.

తాజాగా ఈ సినిమాను సిద్దం చేస్తున్నాడు.

‘పవర్‌స్టార్‌’ను ‘గోకులంలో సీత’ కు లింక్‌ పెట్టిన వర్మ-Movie-Telugu Tollywood Photo Image

రామ్‌ గోపాల్‌ వర్మ ఈ చిత్రాన్ని కూడా తన ఏటీటీ ద్వారా విడుదల చేసేందుకు రెడీ చేస్తున్నాడు.

అందుకు సంబంధించిన తేదీని కూడా అధికారికంగా ఒకటి రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.ప్రస్తుతం చివరి దశలో షూటింగ్‌ జరుపుతున్న వర్మ ఈ చిత్రాన్ని ఈ నెలలోనే విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు.

పవన్‌ కళ్యాణ్‌కు మొదటి సక్సెస్‌గా నిలిచిన గోకులంలో సీత చిత్రం విడుదల తేదీ అయిన జులై 24న పవర్‌ స్టార్‌ చిత్రాన్ని కూడా విడుదల చేయబోతున్నాడు.

సినిమాకు సంబంధించిన స్టిల్స్‌ సినిమా ఎంతటి వివాదాస్పదంగా ఉంటుందో చెప్పకనే చెబుతోంది.

ఇదే సమయంలో వర్మ మాత్రం వెంకటేశ్వర స్వామి మీద ఒట్టు వేసి చెబుతున్నాను ఈ చిత్రంలో ఎవరిని కించ పర్చే విధంగా చూపించడం లేదు అంటున్నాడు.మొత్తానికి రామ్‌ గోపాల్‌ వర్మ మరో సంచలనం ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రావడం కన్ఫర్మ్‌ అయ్యింది.

#July24th #ATT #Ram Gopal Varma #Power Star

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Power Star Release Date July 24th Related Telugu News,Photos/Pics,Images..