స్టైలిష్ స్టార్ కి కంగ్రాట్స్ చెప్పిన పవర్ స్టార్...  

power star pawan kalyan says a wishes to the stylish star allu arjun - Telugu Ala Vaikuntapuramulo, Pawan Kalyan, Pawan Kalyan And Allu Arjun, Pawan Kalyan Latest News, Pawan Kalyan Says A Wishes To Allu Arjun, Tollywood

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన టువంటి చిత్రం అల వైకుంఠపురములో.ఈ చిత్రంలో హీరోగా స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటించాడు.

Power Star Pawan Kalyan Says A Wishes To The Stylish Star Allu Arjun

ఇందులో బన్నీ సరసన పూజా హెగ్డే, నివేదా పేతురాజ్ కథానాయకులుగా నటించగా సీనియర్ నటుడు జయరామ్, సీనియర్ నటి టబు, సునీల్, నవదీప్, సముద్రఖని వంటి వారు ప్రధాన తారాగణంగా నటించారు.

తాజాగా ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 12వ తారీకున ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం అంచనాలకు తగ్గట్టుగానే మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.అలాగే కలెక్షన్ల పరంగా కూడా మంచి వసూళ్లు సాధించి బన్నీ సినీ కెరీర్ లోనే బెస్ట్ చిత్రంగా నిలిచింది.

దీంతో ఇప్పటికే విడుదలైన మొదటి రోజే ఈ చిత్రం 85 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా తెలిపారు. అంతేగాక ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన టువంటి బాహుబలి రికార్డులను కూడా ఇతర దేశాల్లో ఇప్పటికే బన్ని బద్దలు కొట్టాడు.

అయితే ఇది ఇలా ఉండగా తాజాగా జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కి అభినందనలు తెలుపుతూ పుష్పగుచ్చాలు పంపించారు.అంతేగాక తను భవిష్యత్తులో చేయబోయే ఇటువంటి సినిమాలకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పారు.ఈ విషయంపై అల్లుఅర్జున్ స్పందిస్తూ పవన్ కళ్యాణ్ గారి నుంచి శుభాకాంక్షలు రావడం తనకు ఎంతో సంతోషంగా ఉంది.అలాగే థాంక్యూ వెరీమచ్ పవన్ కళ్యాణ్ గారు అంటూ బన్నీ తన అధికారిక ఖాతా ద్వారా తెలిపాడు.

అయితే ఇది ఇలా ఉండగా గతంలో అల్లు అర్జున్ కి మెగా ఫ్యామిలీకి పడదని అందువల్లనే అల్లుఅర్జున్ సొంత కుంపటి పెట్టుకున్నట్లు వార్తలు వచ్చాయి.దీంతో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కి అభినందనలు తెలపడంతో వారి మధ్య ఎటువంటి విభేదాలు లేవని తెలుస్తోంది.

#Pawan Kalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Power Star Pawan Kalyan Says A Wishes To The Stylish Star Allu Arjun Related Telugu News,Photos/Pics,Images..