రీ ఎంట్రీ ఇస్తున్న పవన్,తెలుగులో రీమేక్ అవుతున్న లూసిఫర్!  

Power Star Pawan Kalyan Re-entry With Lusifer Remake - Telugu Pawan Kalyan, , Present Pawan Kalyan In Political, Ram Charan Take The Lucifar Reamake Rights, Ramcharan Waiting For Pawan Cinima Re Entry, So Manay Director Are Waiting For Pawan Kalyan Cinima Re Entry

ఒకప్పుడు స్టార్ హీరోగా తనకంటూ ఒక భారీ స్థాయిలో అభిమానులను సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సడన్ గా సినిమాలకు గుడ్ బై చెప్పి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టిన విషయం విదితమే.పవన్ పేరు వింటేనే అభిమానులలో వైబ్రేషన్స్ మొదలవుతూ ఉంటాయి.

Power Star Pawan Kalyan Re-entry With Lusifer Remake

అంతటి అభిమానులను సంపాదించుకున్న పవన్ సినిమాలకు గుడ్ బై చెప్పడం తో ఆయన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

  అయితే ఈ క్రమంలో గత ఎన్నికల్లో పవన్ జనసేన పార్టీ ఘోర పరాజయం పొందడం తో తిరిగి ఆయన సినిమాలపై దృష్టి పెడతారు అని భావించినప్పటికీ పవన్ మాత్రం రాజకీయాల్లో నే ప్రజలకు సేవ చేస్తాను అని స్పష్టం చేశారు.అయితే ఇప్పుడు తాజాగా ఇండస్ట్రీ లో ఒక వార్త హల్ చల్ చేస్తుంది.అదే పవన్ తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అని.అది కూడా మెగా ఫ్యామిలీ బ్యానర్ ద్వారానే,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాణం లో పవన్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

రీ ఎంట్రీ ఇస్తున్న పవన్,తెలుగులో రీమేక్ అవుతున్న లూసిఫర్-Movie-Telugu Tollywood Photo Image

  తండ్రి రీ ఎంట్రీ ఇవ్వడం కోసం ఇప్పటివరకు భాద్యతలు స్వీకరించిన చెర్రీ ఇప్పుడు బాబాయ్ భాద్యత కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.ఈ క్రమంలోనే పవన్ రీ ఎంట్రీ కోసమనే చెర్రీ లూసిఫర్ రీమేక్ హక్కులను తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.మలయాళం లో వచ్చిన లూసిఫర్ చిత్రం ఎంతగా హిట్ టాక్ ని అందుకుందో అందరికి తెలిసిందే.

  ఈ నేపథ్యంలో నే పవన్ రీ ఎంట్రీ కూడా అంతే పవర్ ఫుల్ గా ఉండాలన్న ఉద్దేశ్యం తో రామ్ చరణ్ ఇలా లూసిఫర్ రీమేక్ హక్కులను తీసుకున్నట్లు తెలుస్తుంది.మరి దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ లో ఇదే పెద్ద హాట్ టాపిక్ గా మారింది.మరి ఈ వార్తల పై పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Power Star Pawan Kalyan Re-entry With Lusifer Remake-,present Pawan Kalyan In Political,ram Charan Take The Lucifar Reamake Rights,ramcharan Waiting For Pawan Cinima Re Entry,so Manay Director Are Waiting For Pawan Kalyan Cinima Re Entry Related....