వకీల్ సాబ్‌ ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పవన్‌ హాజరుపై క్లారిటీ వచ్చేసింది

పవన్‌ కళ్యాణ్‌ వకీల్‌ సాబ్ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.పవన్ నుండి మూడు సంవత్సరాల గ్యాప్‌ తర్వాత వస్తున్న సినిమా అవ్వడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి.

 Power Star Pawan Kalyan Promotional Events For Vakeel Saab Movie , Pawan Kalyan-TeluguStop.com

ఎంత భారీ అంచనాలు ఉన్నా కూడా సినిమాకు పబ్లిసిటీ చేయకుంటే ఫలితం తారు మారు అయ్యే ప్రమాదాలు ఉంటాయి.భారీ ఓపెనింగ్స్ కోసం హైప్‌ క్రియేట్‌ చేయడం కోసం పబ్లిసిటీ కార్యక్రమాలు నిర్వహించాల్సిందే.

వకీల్‌ సాబ్ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కు పోలీసులు అనుమతించలేదు.దాంతో పవన్‌ ఇంటర్వ్యూలతో పాటు కొన్ని మీడియా ఇంట్రాక్షన్‌ తో పబ్లిసిటీ చేయాలనుకున్నారు.

కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ ఈ సినిమా కోసం ఒక్క కామన్‌ ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు.అంతకు మించి ఏ ఒక్క ఈవెంట్‌ లో కూడా పాల్గొనడం లేదని చెబుతున్నారు.

ఏప్రిల్‌ 3వ తారీకున తిరుపతి పర్యటన కోసం జనసేన పార్టీ సిద్దం అవుతుంది.పవన్‌ కళ్యాణ్‌ అందుకు సంబంధించిన ఏర్పాట్లలో ఉన్నాడు.ఇలాంటి సమయంలో ఆయన వకీల్‌ సాబ్‌ సినిమా ప్రమోషన్ కోసం హాజరు అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.పవన్‌ కళ్యాన్‌ మరియు దిల్‌ రాజు కలిసి ఒక ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారని దర్శకుడు వేణు శ్రీరామ్‌ కూడా ఉంటాడని అంటున్నారు.

ఆ ఇంటర్వ్యూను ప్రత్యేకంగా డిజైన్‌ చేస్తారట.ప్రముఖ దర్శకుడు ఒకరు లేదా ఇద్దరు ఆ ఇంటర్వ్యూను చేస్తారని కూడా అంటున్నారు.

మొత్తానికి వకీల్‌ సాబ్‌ ప్రమోషన్ కోసం పవన్‌ ఎక్కువ సమయం మాత్రం కేటాయించలేక పోతున్నాడు అనేది నిజం.పవన్ కళ్యాణ్‌ మరో వైపు హరి హర వీరమల్లు సినిమా షూటింగ్‌ లో కూడా పాల్గొంటున్నాడు.

కనుక వకీల్ సాబ్‌ కు ఆయన కేటాయించే సమయం తక్కువ అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube