పవన్ చరణ్ కాంబినేషన్ లో మూవీ.. దర్శకుడెవరంటే..?  

సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రీఎంట్రీలో వరుసగా సినిమాలకు కమిటవుతూ కెరీర్ లో గ్యాప్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తైంది.

TeluguStop.com - Power Star Pawan Kalyan Green Signal For One More Movie

వచ్చే నెలలో పవన్ సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కనున్న అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు.

ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా పవన్ క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమాలో, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

TeluguStop.com - పవన్ చరణ్ కాంబినేషన్ లో మూవీ.. దర్శకుడెవరంటే..-Gossips-Telugu Tollywood Photo Image

అయితే తాజాగా పవన్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది.జానీ మాస్టర్ చెప్పిన కథ అద్భుతంగా ఉండటంతో పవన్ ఇప్పటికే ప్రకటించిన సినిమాల షూటింగులు పూర్తైన తరువాత జానీ మాస్టర్ దర్శకత్వంలో నటించడానికి అంగీకరించారని సమాచారం.

జానీ మాస్టర్ చాలా సంవత్సరాల నుంచి డైరెక్టర్ గా మారాలని ప్రయత్నం చేస్తున్నారు.అందుకోసం ఇప్పటికే కొన్ని కథలను సిద్ధం చేసుకున్నారు.ఇప్పటికే ఇండస్ట్రీలో పలువురు కొరియోగ్రాఫర్లు దర్శకులుగా మారి విజయాలను సొంతం చేసుకున్నారు.పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తరువాత రామ్ చరణ్ కూడా ఈ సినిమా కథను విన్నాడని జానీ మాస్టర్ తో చరణ్ ఈ సినిమాను తానే నిర్మిస్తానని మాట ఇచ్చారని సమాచారం.

రామ్ చరణ్ నిర్మాతగా ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి నిర్మించి విజయాలను సొంతం చేసుకున్నారు.కొరటాల శివ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ఆచార్య సినిమాకు రామ్ చరణ్ ఒక నిర్మాతగా ఉన్నారు.

గతంలో బాబాయ్ పవన్ కళ్యాణ్ తో కూడా సినిమాలను నిర్మిస్తానని చెప్పిన చరణ్ ఆ మాట నిలబెట్టుకుంటున్నారు.పవన్ కళ్యాణ్ హీరోగా చరణ్ నిర్మాతగా జానీ మాస్టర్ దర్శకత్వంలో సినిమా అంటే ఫ్యాన్స్ కు పండగ లాంటి వార్త అనే చెప్పాలి.

#GreenSingal #PowerStar #Producer Charan #DirectorJani

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

Power Star Pawan Kalyan Green Signal For One More Movie Related Telugu News,Photos/Pics,Images..