పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'దేవర'..!

వర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బండ్ల గణేష్ ఓ సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నారు.ఆల్రెడీ తీన్మార్, గబ్బర్ సింగ్ సినిమాలతో బండ్ల గణేష్ కు ప్రొడ్యూసర్ గా ఛాన్స్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ తో హ్యాట్రిక్ సినిమా చేయాలని చూస్తున్నారు.ఈ సినిమా త్వరలోనే ఉండబోతుందని తెలుస్తుంది.అయితే ఈ సినిమా సెట్ అవకుండానే టైటిల్ ఫిక్స్ అవడం విశేషం.పవర్ స్టార్ మీద తన అభిమానాన్ని చూపిస్తూ ఈమధ్య దేవర అంటూ సంభోదిస్తున్నాడు బండ్ల గణేష్. అయితే పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఇదేదో బాగుందని ఈ టైటిల్ పెట్టేశేయండి అంటూ చెబుతున్నారు.

 Power Star Pawan Kalyan Devara, Devara Latest News,  Movies , Pawan Kalyan , Pow-TeluguStop.com

దానితో బండ్ల గణేష్ దేవర టైటిల్ తోనే పవన్ సినిమా చేయాలని అనుకుంటున్నారట.సినిమా కథ రెడీ చేశాక ఎవరైనా టైటిల్ అనుకుంటారు కాని బండ్ల గణేష్ మాత్రం కొత్తగా టైటిల్ అనుకుని దాని కోసం కథ రెడీ చేయిస్తారని తెలుస్తుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు దేవర టైటిల్ పర్ఫెక్ట్ సూట్ అవుతుంది.ప్రస్తుతం పవర్ స్టార్ క్రిష్ డైరక్షన్ లో హరి హర వీరమల్లు, సాగర్ చంద్ర డైరక్షన్ లో అయ్యప్పనుం కోషియం రీమేక్ చేస్తున్నారు.

ఈ రెండు సినిమాల తర్వత హరీష్ శంకర్ సినిమా ఉంటుందని తెలిసిందే.మరి బండ్ల గణేష్ సినిమాకు ఎవరు డైరెక్ట్ చేస్తారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube