భారీగా అమ్ముడుపోయిన పవన్ కళ్యాణ్ సినిమా ఆడియో రేట్లు?

Power Star Pawan Kalyan Bheemla Nayak Audio Rights Sold For Huge Prices

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మనందరికీ తెలిసిందే.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫాన్స్ ఫాలోయింగ్ కానీ, అలాగే ఆయనకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

 Power Star Pawan Kalyan Bheemla Nayak Audio Rights Sold For Huge Prices-TeluguStop.com

సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా కూడా ఆయనకు ఏ మాత్రం క్రేజ్ తగ్గదు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే థియేటర్ల వద్ద భారీ కటౌట్లతో థియేటర్ల వద్ద పండుగ వాతావరణాన్ని తలపిస్తూ ఉంటుంది.

ఇక ప్రీ రిలీజ్ వేడుకలకు అయితే కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతూ ఉంటుంది.కేవలం ప్రీ రిలీజ్ వేడుకలకు కోటి రూపాయల బిజినెస్ జరిగినప్పుడు మరి సినిమాలకు ఏ రేంజ్ లో బిజినెస్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

 Power Star Pawan Kalyan Bheemla Nayak Audio Rights Sold For Huge Prices-భారీగా అమ్ముడుపోయిన పవన్ కళ్యాణ్ సినిమా ఆడియో రేట్లు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి.

అందులో ఒకటి భీమ్లా నాయక్ సినిమా కాగ, మరొకటి హరిహర వీరమల్లు.భీమ్లా నాయక్ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.

సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే ఈ సినిమా ఆడియో హక్కులను టిప్స్ సంస్థ ఐదున్నర కోట్ల రూపాయలకు చేజిక్కించుకుంది అని పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.ఇకపోతే ఇప్పటికే భీమ్లా నాయక్ సినిమా నుంచి విడుదల అయిన పాటలు యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే.

ఈ పాటలకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.

Telugu Rates, Bheemla Nayak, Harihara, Pawan Kalyan, Tips Music, Tollywod, Tollywood-Movie

ఐదున్నర కోట్ల రూపాయలు ఈ ఆడియో హక్కులపై రావడం అంటే చాలా గొప్ప విషయం అని వార్తలు వినిపిస్తున్నాయి.హరిహర వీరమల్లు సినిమా విషయానికి వస్తే ఈ సినిమాకు జాగర్లమూడి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమాను ఎ ఎం రత్నం నిర్మిస్తున్నారు.

సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా ఆడియో హక్కులను కూడా టిప్స్ సంస్థ దక్కించుకుంది.

సినిమా ఆడియో హక్కులను నాలుగున్నర కోట్ల రూపాయలకు చేజిక్కించుకుంది అని సినీ వర్గాల నుంచి సమాచారం.భీమ్లా నాయక్ సినిమా శివరాత్రి పండుగ సందర్భంగా ఫిబ్రవరి 25న విడుదల కానుంది.

హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు.

#Bheemla Nayak #Rates #Tollywod #HariHara #Bheemla Nayak

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube