ఆ సినిమా హిట్ అయ్యి ఉంటే పవన్ కళ్యాణ్ సినిమాలు మానేసేవాడట!

మెగా స్టార్ తమ్ముడుగా టాలీవుడ్ కి పరిచయం అయిన మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.వరుసగా ఏడు సినిమాలు సూపర్ హిట్ కొట్టి ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించాడు పవన్ కళ్యాణ్.

 Pawan Kalyan About Johnny Movie, Johnny Movie, Flop Talk, Pawan Kalyan, Akkada A-TeluguStop.com

అలాంటి స్టార్ హీరో కేవలం హీరోగా మాత్రమే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా కూడా చేశారు.తన జీవితం సినిమాల కే కాకుండా రాజకీయ పరంగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు.

1996 లో “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయినా పవన్ కళ్యాణ్ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.దాదాపు 24 కి పైగా సినిమా ల్లో నటించి తన నటనకు గుర్తింపు అందుకున్నారు.

అంతేకాదు పవన్ కళ్యాణ్ కి కొన్ని లక్షల మందికి పైగా అభిమానులు ఉన్నారు.అలాంటి హీరో జానీ సినిమా గురించి గతంలో కొన్ని ఆసక్తికర విషయాలు మాట్లాడారు.

2003లో విడుదలై న జానీ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది.కాగా బాక్సాఫీస్ వద్ద మాత్రం హిట్ కొట్టలేకపోయింది.

ఈ సినిమా హిట్ కాలేదు అన్న విషయం పవన్ కళ్యాణ్ ఒప్పుకోగా జీవితంలో ఓటమి, గెలుపు అనేది సహజం అని ఓడిపోవడంతో జీవితం అక్కడే ఆగిపోదు… ముందుకు పోవాలి అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

జానీ సినిమా దర్శకుడిగా నాకు అవకాశం వచ్చినప్పటికీ ఈ సినిమా హిట్ అయ్యి ఉంటే మళ్లీ సినిమాల్లో కనిపించే వాడిని కాదు.

ఈ సినిమా ప్లాప్ అవ్వడం వల్లే నేను ఇప్పటికి సినిమాల్లో ఉన్న అని చెప్పుకొచ్చాడు.అంతేకాదు ఈ సినిమా ప్లాప్ అయినా సినిమా లో ఉన్న పాటలు ఇప్పటికీ అద్భుతం అని జానీ సినిమా అతనికి మంచే చేసిందని చెప్పుకొచ్చాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube