పవర్ స్టార్ సినిమా విషయంలో ఆర్జీవీకి కలిసిరాని నెగిటివ్ పబ్లిసిటీ  

power star movie not buzzing with RGV strategy, Tollywood, Telugu cinema, South cinema, janasena, Pawan Kalyan fans - Telugu Janasena, Pawan Kalyan Fans, Power Star Movie Not Buzzing With Rgv Strategy, South Cinema, Telugu Cinema, Tollywood

నెగిటివ్ పబ్లిసిటీతో ఆ సినిమాని ప్రమోట్ చేసుకుని క్యాష్ చేసుకునే దర్శకుల జాబితాలో అందరికంటే ముందుగా వినిపించే పేరు రామ్ గోపాల్ వర్మ.ఏదో ఒక కాంట్రవర్సీ సబ్జెక్ట్ తీసుకొని దానికి తనకు తోచిన రంగుల అద్దేసి జనాల మీదికి వదులుతూ ఉంటాడు.

 Power Star Movie Not Buzzing With Rgv Strategy

అయితే వివాదాస్పద అంశాలు కావడంతో సినిమాలో కూడా అలాంటి ఎలిమెంట్స్ ఉంటాయని భావించే ప్రేక్షకులకు తర్వాత అసలు విషయం బోధపడుతుంది.కంటెంట్లో ఎలాంటి విషయం లేకుండా కేవలం కాంట్రవర్షియల్ ప్రమోషన్ తో సినిమాని అమ్మేసుకుని డబ్బులు చేసుకుంటూ ఉంటారు.

తన సినిమా గురించి జనాలు చేసే రచ్చను స్ట్రాటజీగా వాడుకోవడం ఆర్జీవి స్టైల్.ప్రస్తుతం లాక్డౌన్ సమయంలో కూడా అందరూ షూటింగ్లో ఆపేసి ఇంటికే పరిమితం అయిపోతే ఆర్జీవి మాత్రం ఏకంగా మూడు సినిమాలు రిలీజ్ చేశాడు.

పవర్ స్టార్ సినిమా విషయంలో ఆర్జీవీకి కలిసిరాని నెగిటివ్ పబ్లిసిటీ-Movie-Telugu Tollywood Photo Image

ఇప్పుడు పవన్ కళ్యాణ్ కథతో పవర్ స్టార్ అనే టైటిల్ తో సినిమాని తెరకెక్కిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ ని పోస్టర్ల ద్వారా వర్మ మొదలుపెట్టాడు.

ఓ రాజకీయ పార్టీ అధినేత స్టోరీగా ఈ సినిమాను ఆవిష్కరిస్తున్న, దీనికి ఎవరి నిజ జీవిత సంఘటనలతో సంబంధం లేదని కూడా సోషల్ మీడియాలో వర్ష పోస్టులు పెట్టి సినిమాని ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా కూడా పెద్ద ఎత్తున అవతలి వారిని టార్గెట్ చేస్తూ ఉంటారు.

ఎలాంటి వారినైనా ట్రోల్ చేసి వదులుతారు.అయితే పవర్ స్టార్ మూవీ విషయంలో పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్దగా స్పందించడం లేదు.

ఆర్జివి ఎన్ని రకాలుగా పోస్ట్లు పెట్టి అభిమానులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నా కూడా జనసైనికులు మాత్రం సైలెంట్ గానే ఉన్నారు.మెగా ఫ్యామిలీ నుంచి కూడా పవర్ స్టార్ సినిమా గురించి ఎలాంటి వ్యాఖ్యలు వినిపించడం లేదు.

అలాగే ప్రమోషన్ చేసిన స్థాయిలో కంటెంట్లో విషయం ఉండదనే విషయం అర్థం కావడంతో అనుకున్న స్థాయిలో తన నెగిటివ్ పబ్లిసిటీ ఈ సినిమాకి ఉపయోగపడటం లేదనే మాట వినిపిస్తోంది.

#Janasena

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Power Star Movie Not Buzzing With Rgv Strategy Related Telugu News,Photos/Pics,Images..