తెలుగులో ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం టాలీవుడ్ పవర్ స్టార్ మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జీవిత గాథ ఆధారంగా “పవర్ స్టార్” అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ చిత్రంలో ఇటీవలే భారతదేశంలో నిషేధించిన టిక్ టాక్ యాప్ లో పవన్ కళ్యాణ్ ని అనుకరిస్తూ వీడియోలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న “సురేష్” అనే యువకుడు హీరోగా నటిస్తున్నాడు.
అయితే తన చిత్రాలలో కంటెంట్ పెద్దగా లేకపోయినప్పటికీ పోస్టర్ల ద్వారా హైప్ క్రియేట్ చేసిన రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లను రోజూ ఒకటి విడుదల చేస్తూ ఈ చిత్రంపై అమాంతం ఆసక్తి ని పెంచుకున్నాడు.
అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక పోస్టర్ ని రామ్ గోపాల్ వర్మ విడుదల చేశాడు.
అయితే ఈ పోస్టర్ లో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాత్రలో నటిస్తున్న వ్యక్తి కి పవన్ కళ్యాణ్ చేతులెత్తి మొక్కుతున్నట్లు కనిపిస్తోంది.దీంతో ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.
కాగా రామ్ గోపాల్ వర్మ ఈ పోస్టర్ ద్వారా పవర్ స్టార్ ఈ చిత్ర ట్రైలర్ ని చూడాలంటే ముందుగా వీక్షకులు “25 రూపాయలు” చెల్లించాల్సి ఉంటుందని తెలిపాడు.
ఈ విషయంపై స్పందించిన కొందరు నెటిజన్లు ఇలాంటి పోస్టర్లు విడుదల చేసి కంటెంట్ లేని చిత్రం మీద ఆసక్తి పెంచి డబ్బులు సంపాదించాలని రామ్ గోపాల్ వర్మ ప్రయత్నిస్తున్నాడని వ్యంగంగా కామెంట్లు చేస్తున్నారు.
అయితే రామ్ గోపాల్ వర్మ మాత్రం నెటిజన్ల మాటలను అస్సలు పట్టించుకోవడం లేదు.కాగా ఈ చిత్రాన్ని ఈ నెల 24వ తారీఖున ఆన్ లైన్ థియేటర్ ద్వారా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.
అలాగే ఈ నెల 22వ తారీఖున ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించాడు.అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ మర్డర్ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.