బాలయ్య సినిమాలో పవర్ స్టార్.. అసలు విషయం?

నందమూరి కుటుంబం నుంచి ఎంతో మంది నటులు సినిమాలలో నటించగా.ఆ కుటుంబం సినీ పరిశ్రమలోని మంచి పేరు దక్కించుకుంది.

 Power Star In Balayya Movie , Power Star, Balakrishna, Puneet Rajkumar, Tollywoo-TeluguStop.com

సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు నటనలో గుర్తింపును, అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు.కాగా మొదట బాలనటిగా సినీ పరిశ్రమకు పరిచయమై ప్రస్తుతం వరకు సినిమాలలో హీరోగా నటిస్తున్నా నందమూరి బాలకృష్ణ గురించి అందరికీ తెలిసిందే.

కాగా ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న సినిమా లో బాలయ్యతో కాంబినేషన్ గా పవర్ స్టార్ నటించబోతున్నారనే విషయం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.

బాలయ్య అభిమానులకు ఇది సంతోషకరమైన వార్తే.

ఎందుకంటే పవర్ స్టార్ కు ఉన్న ఫాలోయింగ్ బాలయ్య కూడా అంతే ఉంది.మరి ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా గురించి మరింత టాపిక్ గా మారింది.

మరి ఆ పవర్ స్టార్ మన తెలుగు పవర్ స్టార్ అనుకుంటే తప్పులో కాలేసినట్టే.మరి ఎవరానుకుంటున్నారా కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్.

ఈయన కన్నడ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు ఉన్న నటుడు.ఈయనకు ఉన్న అభిమానులు అంతా ఇంతా కాదు.

అందుకే ఆ పవర్ స్టార్ ను మన నందమూరి బాలయ్య తో నటించాలనే ఆలోచనతో చిత్రబృందం నిర్ణయించుకొంది.

Telugu Balakrishna, Puneet Rajkumar, Tollywood-Movie

బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న బాలయ్య చిత్రంలో మల్టీస్టార్ గా మరో హీరోను పెట్టి తీయాలనుకున్నారు.దీంతో కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ను నిర్ణయించుకొని అందులో తన పాత్ర పోలీస్ ఆఫీసర్ గా నటిస్తారనే విషయాన్ని తెలిపారు.కాగా ఈ సినిమాలో కొన్ని కీలకమైన యాక్షన్ ల కోసం పిడుగురాళ్ల లో పలుగు రాళ్ల తో నిండిన గుట్టలో షూటింగ్ చేయడానికి చేసుకున్నారు.

ఇదిలా ఉంటే బాలయ్య నటించిన శాతకర్ణి సినిమా లో అతిధి పాత్రలో కనిపించిన శివ రాజ్ కుమార్ ఎవరో కాదు.పునీత్ రాజ్ కుమార్ సోదరుడు.వీరిద్దరూ బాలయ్య చిత్రం లో నటించడం చెప్పుకోదగ్గ విషయం.కాగా ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ నటిస్తుండగా… ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల అవుతుందని సినీ బృందం తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube