న్యూయార్క్‌లో 5 గంటల పాటు పవర్‌కట్ 1977 గుర్తొచ్చి వణికిన జనం

అమెరికా ఆర్ధిక రాజధాని న్యూయార్క్‌ పవర్‌కట్‌తో అల్లాడింది.సుమారు 5 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో జనజీవనం దాదాపుగా స్తంభించింది.

 Power Cut In New York City And Backs In 5 Hourse-TeluguStop.com

ఆదివారం అర్ధరాత్రి న్యూయార్క్‌ నగరానికి విద్యుత్ సరఫరా చేసే ఆరు నెట్‌వర్క్‌లలో సాంకేతిక సమస్య తలెత్తడంతో కరెంట్ సరఫరా నిలిచిపోయింది.దీని కారణంగా రవాణా వ్యవస్థకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.

అనేక ప్రాంతాల్లో వందలాది రైళ్లు నిలిచిపోయాయి.అయితే వెంటనే స్పందించిన విద్యుత్ సంస్థ కాన్ ఎడిసన్ నగరానికి సమీపంలోని ఒక సబ్‌స్టేషన్‌లో సాంకేతిక సమస్య తలెత్తినట్లుగా గుర్తించింది.

న్యూయార్క్‌లో 5 గంటల పాటు పవర్

దీనికి సరైన కారణం మాత్రం సదరు సంస్థ కనుగొనలేదు.ఐదు గంటల పాటు శ్రమించిన అనంతరం మ్యాన్‌హట్టన్‌లోని 70 వేల నివాస సముదాయాలు, వ్యాపార కార్యాలయాలకు కాన్ ఎడిసన్ విద్యుత్ సరఫరా పునరుద్దరించింది.అయితే హడ్సన్ నదికి పశ్చిమాన ఉన్న ఫిఫ్త్ ఎవెన్యూ ప్రాంతంలో మాత్రం పవర్ కటల్ ఉంటుందని అధికారులు తెలిపారు.కాగా.1977లో భారీ పవర్ కట్ కారణంగా న్యూయార్క్ అంధకారంలో మునిగిపోయింది.ఆ సమయంలో ప్రజలు, సంఘ విద్రోహ శక్తులు భారీ ఎత్తున లూటీలకు పాల్ప డ్డాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube