కరోనా వైరస్ రూపాంతరం... ఆ టీకాలకు ఢోకాలేదు: భారత సంతతి శాస్త్రవేత్త పరిశోధన

చైనాలో పుట్టిన కరోనా వైరస్‌కు టీకా కనుగొనేందుకు ప్రపంచ దేశాలన్నీ కిందా మీద పడుతున్నాయి.ఈ భూమ్మీదకు వైరస్ వచ్చి ఇప్పటికే ఏడాది కావొస్తున్నా ఇంత వరకు వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవడం కలవరపాటుకు గురిచేస్తోంది.

 Potential Covid-19 Vaccines Not Affected By Recent Mutations: Study  Chaina, Cor-TeluguStop.com

వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు.ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా 300కు పైగా టీకాలు అభివృద్ధి దశలో ఉన్నాయి.

ఇది మానవాళికి ఆనందం కలిగించే వార్తే అయినా.వైరస్ రూపాంతరం చెందుతుండటం విస్మయానికి గురిచేస్తోంది.

కరోనా వైరస్ రూపాంతరం చెందుతూ మొత్తంగా 10 రకాలుగా మారిపోయిందని గతంలో భారత శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడైంది.చైనాలోని వుహాన్‌ కరోనా వైరస్ పుట్టిల్లు.అక్కడ పుట్టిన వైరస్ ‘O’రకానికి చెందినది.ఆ తర్వాత మరో 10 రకాలుగా కరోనా మహమ్మారి రూపాంతరం చెందిందని భారత పరిశోధకులు చెబుతున్నారు.

డిసెంబర్ 2019 నుంచి 2020 ఏప్రిల్ 6 వరకు ప్రపంచవ్యాప్తంగా 55 దేశాల నుంచి సేకరించిన శాంపిల్స్ ఆధారంగా నిర్ణయించినట్లు తెలిపారు.

మొత్తంగా 3 వేల 600 కరోనా వైరస్ ఆర్ఎన్ఏలపై పరిశోధనలు జరిపినట్లు వెల్లడించారు.

రూపాంతరం చెందిన 10 రకాల్లో .అన్నింటి కంటే ఏ2ఏ వైరస్ చాలా ప్రమాదకరమని వెల్లడించారు.ఇది ఊపిరితిత్తుల్లోకి ఎక్కువ సంఖ్యలో త్వరగా దూసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉన్నట్లు గుర్తించారు.అంతే కాదు ఇదే వైరస్ .త్వరితగతంగా కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందేందుకు కారణమైందని అనుమానం వ్యక్తం చేశారు.కరోనా వైరస్ వేగంగా తన రూపాన్ని మార్చుకోవడం వల్ల వ్యాక్సిన్ తయారు చేసే పరిశోధకులకు తయారీ సాధ్యం కావడం లేదని తెలిపారు.

అయితే వైరస్‌లో చోటు చేసుకున్న మార్పుల వల్ల టీకాల సమర్థతపై ఎలాంటి ప్రభావం వుండదన్నారు భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త ప్రొఫెసర్ శేషాద్రి వాసన్.ఈయన ఆస్ట్రేలియాలోని కామన్‌వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (సీఎస్ఐఆర్‌వో)లో విధులు నిర్వహిస్తున్నారు.

వుహాన్‌లో పుట్టిన సార్స్ కోవ్ 2ను ఆధారంగా చేసుకుని ప్రపంచంలోని పలు దేశాల శాస్త్రవేత్తలు వ్యాక్సిన్‌ను రూపొందించే పనిని ప్రారంభించారు.అనంతర కాలంలో ఈ వైరస్‌లో మార్పులు మొదలయ్యాయి.

Telugu Australia, Chaina, Coronavirus, Csiro, Dg, Glaisin, Sheshadri Vasan-Telug

వైరస్ ఉపరితలంపై వుండే స్పైక్ ప్రోటీన్‌లోని 614 అనే నిర్దిష్ట ప్రాంతంలో డీ (యాస్పార్టేట్) అనే అమైనో యాసిడ్ ‘జి’ (గ్లైసిన్)గా మారింది.దీంతో ఈ మార్పును ‘‘ డీ614 జీ’’గా పిలుస్తున్నారు.అలాగే ఈ కరోనా వైరస్‌ను ‘ జి ’ రకంగా వ్యవహరిస్తున్నారు.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వెలుగు చూస్తున్న కేసుల్లో ‘‘ జి ’’ రకం వాటా 85 శాతానికి పెరిగింది.

దీని వల్ల ప్రస్తుతం అభివృద్ది దశలో ఉన్న వ్యాక్సిన్లపై ప్రతికూల ప్రభావం పడుతుందన్న ఆందోళనలు మొదలయ్యాయి.

దీనిపై నిగ్గు తేల్చడానికి వాసన్ నేతృత్వంలో సీఎస్ఐఆర్‌వో బృందం ఫెర్రెట్స్ అనే ఒక రకం జంతువులపై పరిశోధన చేపట్టింది.

ప్రయోగంలో భాగంగా వీటిలో కొన్నింటికి ‘డి’ రకాన్ని, మరికొన్నింటికి ‘జి’ వైరస్‌ను చొప్పించారు.అభివృద్ధి దశలో ఉన్న టీకాను వాటికి ఇచ్చారు.

రెండు వైరస్‌ రకాలపైన ఆ వ్యాక్సిన్ సమర్థంగా పనిచేసినట్లు తేలిందని డాక్టర్ వాసన్ పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube