పొడిబారిన పెద‌వుల‌ను మృదువుగా మార్చే బంగాళాదుంప.. ఎలాగంటే?

అస‌లే వింట‌ర్ సీజ‌న్‌.ఈ సీజ‌న్‌లో దాదాపు అంద‌రినీ పొడి చ‌ర్మం తెగ ఇబ్బంది పెడుతుంటారు.

 Potato Helps To Get Rid Of Dry Lips! Potato, Dry Lips, Lips, Latest News, Beauty-TeluguStop.com

చ‌ర్మం మాత్ర‌మే పొడి బార‌డం కాదు. పెద‌వులు కూడా త‌ర‌చూ పొడి బారిపోతుంటాయి.

పొడి బారిన పెద‌వుల వ‌ల్ల ముఖం కాస్త అంద‌హీనంగా క‌నిపిస్తుంది.అందుకే పెద‌వుల‌ను మృదువుగా మార్చుకునేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.

మార్కెట్‌లో దొరికే ఏవేవో క్రీములు, ఆయిల్స్, లిప్ బాంబ్స్ యూజ్ చేస్తుంటారు.కానీ, వాటి వ‌ల్ల ఫ‌లితం లేక‌పోతో బాధ ‌ప‌డుతుంటారు.
అయితే స‌హజంగా కూడా పెద‌వుల‌ను మృదువుగా మార్చుకోవ‌చ్చు.ముఖ్యంగా బంగాళాదుంప పొడిబారిన పెద‌వుల‌ను మృదువుగా మార్చ‌డంలో అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.అందుకు ముందుగా బంగాళాదుంప ముక్క‌లుగా క‌ట్ చేసి.పెద‌వులపై కాసేపు రుద్దుకోవాలి.

అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల పెద‌వులు మృదువుగా మార‌తాయి.

మ‌రియు పెద‌వుల‌పై పేరుకుపోయిన మ‌లినాలు కూడా పోతాయి.

Telugu Tips, Dry Lips, Latest, Lips, Potato, Season-Telugu Health

కేవ‌లం బంగాళాదుంప‌తోనే కాదు.పెద‌వులు మృదువుగా మార‌డానికి మ‌రిన్ని మార్గాలు కూడా ఉన్నాయి.తేనె పొడి పెద‌వుల‌ను మృదువుగా మార్చ‌గ‌ల‌దు.

ప్ర‌తి రోజు నిద్రించే ముందు పెద‌వుల‌కు తేనె ఐదు నిమిషాల పాటు మర్ధ‌‌నా చేసుకుని ప‌డుకోవాలి.ఇలా చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది.

అలాగే ప్ర‌తి రోజు క్ర‌మం త‌ప్ప‌కుండా మీగడను పెద‌వుల‌కు అప్లై చేసుకోవాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా పొడి బారిన పెద‌వులు క్ర‌మంగా మృదువుగా మార‌తాయి.
అదేవిధంగా, గులాబీ రేకుల‌ను పేస్ట్ చేసుకుని.ఆ మిశ్ర‌మాన్ని పెద‌వుల‌కు అప్లై చేయాలి.బాగా ఆరిన త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో పెద‌వుల‌ను క్లీన్ చేసుకోవాలి.ఇలా ప్ర‌తి రోజు చేసినా పెద‌వులు సున్నితంగా మ‌రియు ఎర్ర‌గా మార‌తాయి.

ఇక స్ట్రాబెర్రీస్ కూడా పెద‌వుల‌ను మృదువుగా మార్చ‌గ‌ల‌వు.స్ట్రాబెర్రీస్‌ను పేస్ట్ చేసి ర‌సం తీసుకోవాలి.

ఆ ర‌సాన్ని అప్లై చేస్తే.క్ర‌మంగా పెద‌వులు నున్న‌గా మార‌తాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube