ఆలుగడ్డను ఇంటిపనులకు ఎలా ఉపయోగించుకోవచ్చో చూడండి  

Potato Can Be Used For These Household Activities -

ఆలుగడ్డ అనగానే, దాన్ని ఫ్రై చేసుకుందామా, లేక సింపుల్ గా కర్రి చేసుకోవాలా, లేదంటే చిప్స్ చేసుకోవాలా అని ఆలోచిస్తాం.ఆలుగడ్డ ఉపయోగాలు ఇంతేనా ? మరోరకంగా పనికి రాదంటారా ? ఆలుగడ్డతో మీకు తెలియని ఉపయోగాలను చెప్తాం చదవండి.

* ఆలుగడ్డతో మచ్చలను తొలగించుకోవచ్చు తెలుసా.మచ్చలు ఉన్నచోట రోజుకి ఒకసారి మచ్చలు, నల్లటి వలయాలు ఉన్నచోట రాస్తూ ఉండండి, పదినిమిషాలు ఉంచుతూ కడిగేస్తూ ఉండండి.మార్పు మెల్లిగా మీకే కనబడుతుంది

Potato Can Be Used For These Household Activities-General-Telugu-Telugu Tollywood Photo Image

* ఈ టిప్ మీకు బాగా పనికివస్తుంది.ఆలుగడ్డ ఉప్పుని అబ్జర్వ్ చేసుకోగలదు.

ఎప్పుడైనా ఏదైనా కూరలో ఉప్పు ఎక్కువైతే, ఆలుగడ్డ పొట్టు తీసి, కొన్ని ముక్కలుగా కోసి కూరలో వేయండి.అలా ఓ పదిహేను నిమిషాలు పెట్టి, ముక్కలు తీసేసి, కూరలో ఉప్పు తగ్గిందో లేదో చూసుకోండి.

* ఆలుగడ్డ ముక్కలతో మీ బూట్లు తళతళలాడేలా చేయవచ్చు, నమ్మండి.ఓసారి మీ బూట్లకి ఆలుగడ్డని రాసి, తడి ఆరాక తుడిచి చూడండి.

* బోద కళ్ళతో ఇబ్బందిపడితే కూడా ఆలుగడ్డ ఉపయోగపడుతుంది.ఆలుగడ్డని గుండ్రంగా, సన్నగా కోసి, ఓ ఇరవై నిమిషాలు రిఫ్రిజిరెటర్ లో పెట్టండి.

ఆ తరువాత మీ కనులపై ఆ చల్లని ముక్కలని ఉంచుకొని కాసేపు విశ్రాంతి తీసుకోండి.

* ఇనుప వస్తువులకు రస్ట్ పట్టినా, ఆలుగడ్డ సహాయపడుతుంది.

ఆలుగడ్డ ముక్కలకు కొంచెం ఉప్పు చల్లి, మీ ఇనుప వస్తువులను రాయండి.ఫలితం ఉంటుంది.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Potato Can Be Used For These Household Activities Related Telugu News,Photos/Pics,Images..

footer-test