కుండ బిర్యానీ తరహాలో కుండ పిజ్జా..!

వంటల్లో ఎన్నో రకాలు మనము చూసి ఉంటాము, రుచి చూసి కూడా ఉంటాము.అయితే సాధారణంగా చాలా మంది రకరకాల వెరైటీ వంటకాలను తయారు చేస్తుంటారు.

 Pot Biryani Style Pot Pizza, Kullad Pizza, Latest News, Viral Latest, Viral News-TeluguStop.com

వాటి కోసం ప్రయోగాలు చేస్తుంటారు.అలాగే పెద్ద పెద్ద హోటల్లో వింత వింత వంటకాలతో కష్టమర్లను ఆకట్టుకుంటూ ఉంటారు.

అందులో భాగంగా మాములుగా పెద్ద పాత్రల్లో చేసే బిర్యానీ ని కాస్తా కుండల్లో చేసి కుండ బిర్యానీ అని పిలుస్తూ కస్టమర్లు వడ్డిస్తున్నారు.

చాలా మంది భోజన ప్రియులు వెరైటీ వంటకాలను ఇష్టపడుతూ ఉంటారు.

వెరైటీ వంటకాలను రుచి చూడాలని ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు.అందుకే సూరత్ రాష్ట్రం లోని ఓ దుకాణంలో కుండ బిరియాని తరహాలో కుండ పిజ్జా లాంటి వెరైటీ డిష్ ను తయారు చేసి ఆకర్షిస్తున్నారు.

దాని పేరు కుల్హాద్ పిజ్జా అంటే కుండ పిజ్జా.ఇప్పుడు ఈ డిష్ హాట్ రెసిపీగా మారింది.

ఈ కుండ పిజ్జా కోసం కస్టమర్లు క్యూ కడుతున్నారు.అలాగే ఆంచి ముంబై అనే యూట్యూబ్ ఛానల్ సభ్యులు కూడా ఈ విషయం తెలుసుకుని వెంటనే దుకాణం దగ్గరకు చేరుకుని కుల్హాద్ పిజ్జాను రుచి చూశారు.

అంతే కాకుండా ఈ కుండ పిజ్జా రెసిపీ తయారీ విధానం గురించి కూడా అడిగి తెలుసుకున్నారు.ఈ వీడియో మార్చి నెలలో యూట్యూబ్ లో పోస్టు చేయగా 23 లక్షల వ్యూస్ వచ్చాయి.

ఈ పిజ్జా తయారు చేయడానికి ముందుగా మిక్స్చర్ ను వేసి, ఆ తర్వాత ఒక బౌల్ లో కార్న్, తరిగిన టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, చాట్ మసాలాను మిక్స్ చేశారు.ఆ తర్వాత కుండలో మిక్స్చర్ ను నింపి దాని పైన సాస్, వెన్న వేస్తారు.

దానిలో కొంత మొజరెల్లా చీజ్, మరికొంత మిక్స్చర్, లిక్విడ్ చీజ్ ను వేసి కుండను మైక్రో ఒవేన్ లో పెట్టి 5 నిమిషాలు తర్వాత తీస్తే కుండ పిజ్జా తయారీ అయిపోయినట్ఠే.ఆ తర్వాత తినేందుకు సిద్ధమై పోయినట్లే.

దీనికి సంబంధించిన వీడియోను “ఆంచి ముంబై” అనే యూట్యూబ్ ఛానెల్లో కూడా చూడొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube