వాయిదా పడ్డ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడి ఎంపిక...ఇక నిర్ణయం ఎప్పుడంటే?

జీహెచ్ఎంసీలో ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే.అయితే ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ అప్పుడు పీసీసీ చీఫ్ గా ఉన్న ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

 Postponement Of Congress Pcc President Election   When Is The Decision  Congres-TeluguStop.com

ఆ తరువాత కాంగ్రెస్ ముఖ్య నాయకులు మరల పై స్థాయి నాయకులతో, క్షేత్ర స్థాయి నాయకులతో సమావేశం నిర్వహించి కాంగ్రెస్ అధిష్టానానికి నాయకులు మద్దతు తెలిపిన నాయకుల పేర్లను అధిష్టానానికి అందజేశారు.కాని ఆ తరువాత రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పేర్లను బలంగా పరిశీలిస్తున్నట్లు వార్తలు బలంగా వినిపించాయి.

అందులో మరల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పీసీసీ చీఫ్ రేసులో ఉన్నట్లు ఒక్కసారిగా వార్తలు బయటకి వచ్చాయి.మరల కొంత మంది రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ ఎంపికను వ్యతిరేకిస్తూ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు.

ఇక గందరగోళాల మధ్య పీసీసీ చీఫ్ ఎంపిక నిర్ణయం తీసుకోవడం సరైందని భావించిన కాంగ్రెస్ అధిష్టానం తన నిర్ణయాన్ని వాయిదా వేసింది.మరల ఏప్రిల్, మే నెలలో ఈ విషయంపై ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని ప్రకటించాలని నిర్ణయించినట్లు సమాచారం.

ఏది ఏమైనా పీసీసీ చీఫ్ ఎంపిక అనేది కాంగ్రెస అధిష్టానానికి సవాల్ గా మారిందనే చెప్పవచ్చు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube