అస్థికల విషయంలో వినూత్న ఆలోచన చేపట్టిన తపాలా శాఖ..!!

మహమ్మారి కరోనా వైరస్ కారణంగా దేశంలో చాలా మరణాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.ఈనేపథ్యంలో చనిపోయినవారి హస్తికలు నిమజ్జనం చేయడం హిందూ ధర్మంలో ఆచారం కావటంతో చాలామంది కాశీ, గయా లాంటి చోటికి వెళ్ళి గంగానదిలో కలుపుతూ ఉంటారు.

 Postal Department Different Program Kashi, Ganganadhi, Postal Department.-TeluguStop.com

అయితే ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభణతో అస్తికల కోసం అక్కడికి వెళ్లే పరిస్థితి లేకపోవడం చాలామందికి ఇబ్బందిగా మారింది.ఇటువంటి పరిస్థితుల్లో సమీపం నదులలోని అస్తికలు కలిపేస్తున్నారు.

దీంతో గంగానదిలో తమవారి అస్తికలు కలపలేదన్న బాధ చాలామందిలో కనిపిస్తుంది.

Telugu Ganganadhi, Kashi-Latest News - Telugu

ఇలాంటి వారి కోసం తపాలాశాఖ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.కరోనా కారణంగా వారణాసికి వెళ్లలేని వారి కోసం ఒక వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టింది.స్పీడ్ పోస్ట్ లో అస్తికలు కోరుకునే చోట నిమజ్జనం చేసేలా అదికూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లైవ్లో చూసేలా కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది.

దివ్య దర్శన్ అనే సంస్థతో పోస్టల్ శాఖ ఒప్పందం చేసుకొని నిమజ్జన కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు చూసేలా ఈ వినూత్న కార్యక్రమానికి తపాలశాఖ ఆలోచన చేసింది, ప్రస్తుతం తపాల శాఖ నిమజ్జన కార్యక్రమం కోసం నాలుగు పుణ్యక్షేత్రాలను ఎంపిక చేసింది.వారణాసి, ప్రయాగ, గయ, హరిద్వార్ ప్రాంతాలను ఎంపిక చేసుకోవడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube