ఏకంగా గవర్నర్ పై అలాంటి పోస్ట్ పెట్టాడని నటుడు అరెస్ట్...  

Post Sharing About Telangana Governor - Telugu Men Arrested For Bad, Men Arrested For Bad Post Sharing In Social Media, Tamilisai Soundararajan, Telangana Governor, Telangana Governor Tamilisai Soundararajan, Telangana Governor Tamilisai Soundararajan News

ప్రస్తుత కాలంలో కొందరు సమాజంలో మంచి పేరున్న వ్యక్తులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కటకటాల పాలవుతున్నారు.తాజాగా తమిళనాడుకు చెందినటువంటి ఓ వ్యక్తి ఏకంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై పై అసభ్యకర పోస్టులు పెట్టినందుకుగాను ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

 Post Sharing About Telangana Governor

వివరాల్లోకి వెళితే తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి సాధిక్ భాష అనే వ్యక్తి సినిమాల్లో సహాయ నటుడుగా పని చేస్తున్నాడు.అయితే ఇతడు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ అయినటువంటి తమిళిసై పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తన ఫేస్ బుక్ ఖాతా లో పోస్ట్ చేశాడు.

దీంతో ఈ పోస్ట్ అసభ్యకరంగా, గవర్నర్ తమిళిసై పరువుకు భంగం కలిగించే విధంగా ఉండటమే గాకుండా  సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు ఇలాంటిఅనుచిత వ్యాఖ్యలు చేసింది సాధిక్ భాష అని గుర్తించారు.

ఏకంగా గవర్నర్ పై అలాంటి పోస్ట్ పెట్టాడని నటుడు అరెస్ట్…-Latest News-Telugu Tollywood Photo Image

వెంటనే సాధిక్ భాష పై కేసు నమోదు చేస్తూ అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.అయితే అప్పటికే సాదిక్ తన అత్తగారి ఊరు అయినటువంటి కట్టుమేడి మీ గ్రామంలో ఉండగా పోలీసులు అక్కడికి వెళ్లి అరెస్టు చేశారు.

అంతేగాక ప్రస్తుతం సమాజంలోని సాధిక్ భాష లాంటి కొందరు వ్యక్తులు పేరు, గౌరవం కలిగినటువంటి పెద్ద వాళ్లను టార్గెట్ చేస్తూ వారిపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పాపులర్ కావాలని చూస్తున్నారని ఇలాంటివి సరికాదని అన్నారు.అంతేగాక ఇక నుంచి ఎవరైనా అసభ్య పదజాలాన్ని ఉపయోగించి పోస్టులు పెట్టిన లేదా ప్రముఖులు, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినా కటకటాల పాలు కాకతప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Post Sharing About Telangana Governor Related Telugu News,Photos/Pics,Images..

footer-test