ముగింపును ప్రారంభిస్తున్న విరాటపర్వం!  

Post Production Work To Start For Virataparvam - Telugu Rana Daggubati, Sai Pallavi, Venu Udugula, Virataparvam

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రాల్లో తనకంటూ ప్రత్యేక క్రేజ్‌ను దక్కించుకున్న చిత్రం విరాటపర్వం.యంగ్ హీరో రానా దగ్గుబాటి హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా పూర్తి సామాజిక అంశంతో రూపొందుతుండటమే ఈ సినిమాపై క్రేజ్‌ను క్రియేట్ చేసింది.

 Post Production Work To Start For Virataparvam

తెలంగాణలోని 90లలో ఉన్న పరిస్థితులను ఈ సినిమా మన కళ్లకు కట్టేలా చూపించనుంది.ఇక ఈ సినిమాలో నక్సల్ బ్యాక్‌డ్రాప్ మరో లెవెల్‌లో ఉండనుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

ఇప్పటికే 90 శాతానికి పైగా షూటింగ్ ముగించుకున్న విరాటపర్వం లాక్‌డౌన్ కారణంగా షూటింగ్‌ను వాయిదా వేసుకుంది.కేవలం కొంతమేర షూటింగ్ మిగిలి ఉండగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావించింది.

ముగింపును ప్రారంభిస్తున్న విరాటపర్వం-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కానీ లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులు వాయిదా పడ్డాయి.ఇక ప్రస్తుతం సినిమా షూటింగ్‌లకు అనుమతి లభించడంతో విరాటపర్వం పోస్ట్ ప్రొడక్షన్ పనులను వెంటనే ప్రారంభించి, వీలైనంత త్వరగా ముగించేయాలని చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

ఈ మేరకు రామానాయుడు స్టూడియోలో ఓ మ్యూజిక్ స్టూడియోను ఏర్పాటు చేసి పాటలు, రీరికార్డింగ్ పనులు ముగించాలని చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తోంది.ఈ సినిమాలో రానా, సాయిపల్లవి, ప్రియమణి తదితరులు నటిస్తోండగా వేణు ఉడుగుల ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.మరి విరాటపర్వం చిత్రం ఎలాంటి రిజల్ట్‌ను సాధిస్తుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Post Production Work To Start For Virataparvam Related Telugu News,Photos/Pics,Images..

footer-test