పోస్టాఫీస్‌కు చుక్కలు చూపించిన నిరుద్యోగి

ఉత్తరాలు చేరువేసే పోస్టాఫీసు శాఖ అలసత్వం ప్రదర్శించడంతో ఓ నిరుద్యోగి ఆ శాఖకు చుక్కలు చూపించాడు.తనకు రావాల్సిన ఓ రిజిస్టర్ పోస్టును ఆలస్యంగా చేరవేయడంతో అతడు ఓ ఉద్యోగం కోల్పోయాడు.

 Post Office To Pay 1 Lakh Penalty For Delaying Registered Post-TeluguStop.com

ఈ ఘటన వెస్ట్ బెంగాల్‌లో చోటు చేసుకుంది.ఈ ఘటకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.2018 ఏప్రిల్ 6వ తేదీన ఓ వ్యక్తికి ఉద్యోగానికి సంబంధించిన కాల్ లెటర్ రిజిస్టర్ పోస్టు ద్వారా పంపబడింది.

ఆ రిజిస్టర్ పోస్టు 14వ తేదీన ఆ వ్యక్తికి అందాల్సి ఉండగా, అది కాస్త పోస్టల్ డిపార్ట్‌మెంట్ నిర్లక్ష్యం కారణంగా 23వ తేదీన అందింది.

దీంతో ఆ వ్యక్తి ఉద్యోగానికి సంబంధించిన పరీక్ష రాయలేకపోయాడు.కాగా ఆ వ్యక్తి జిల్లా వినియోగదారుల ఫోరమ్‌లో ఈ ఘటనపై ఫిర్యాదు చేశాడు.పోస్టల్ శాఖ వల్ల తనకు భారీ నష్టం జరిగిందని, తనకు ఉద్యోగం పోయిందని ఆ వ్యక్తి పేర్కొన్నాడు.దీంతో పోస్టల్ శాఖకు రూ.లక్ష జరిమానా విధించింది.అయితే దీనిపై పోస్టల్ శాఖ స్టేట్ కమిషన్‌ను ఆశ్రయించింది.

అయితే అక్కడ కూడా పోస్టల్ శాఖ అలసత్వానికి మొట్టికాయలే పడ్డాయి.పోస్టల్ డిపార్ట్‌మెంట్ అలసత్వం కారణంగో ఓ వ్యక్తి ఉద్యోగం కోల్పోయాడని, సదరు వ్యక్తకి 30 రోజుల్లోగా నష్టపరిహారం కింద లక్ష రూపాయలు అందించాల్సిందిగా స్టేట్ కమిషన్ ఆదేశం జారీ చేసింది.

పోస్టల్ శాఖ అలసత్వం, నిర్లక్ష్యానికి సరైన బుద్ధి చెప్పాడని ఆ వ్యక్తిని స్థానికులు మెచ్చుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube