పెట్రోల్ ధర పెంపుపై ఇతను చెప్పే లాజిక్ వింటే మతి పోవాల్సిందే..

సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుండి ప్రతి విషయం నిముషాల్లో చేరిపోతుంది.కొన్ని వార్తలు వింటే నవ్వొస్తుంది.

 Post About Petrol Rate Hike Goes Viral, Petrol Rates In Telugu States, Petrol Ra-TeluguStop.com

మరి కొన్ని వార్తలు వింటే కోపమొస్తుంది.తాజాగా వాట్స్ అప్ లో వచ్చిన ఈ విషయం విని అందరూ షాక్ అవుతున్నారు.

పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.రోజురోజుకూ పెరుగుతూ జనాల కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తున్నాయి.కానీ బీజేపీ పార్టీ భక్తులు మాత్రం వారి ప్రభుత్వం గురించి ఎవరైనా మాట్లాడితే కొత్త కొత్త లాజిక్కులు చెబుతున్నారు.

బీజేపీ లీడర్లు వారి ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు పది ఇరవై పైసలు పెరిగిన గోల గోల చేసేవారు.

కానీ వారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం పెట్రోల్ ధరలు పెరిగిన ఏమి మాట్లాడకుండా నిమ్మకుండిపోతున్నారు.

అంతేకాదు వారికీ సంభందం లేనట్లుగా.

అంతర్జాతీయ మార్కెట్ తో ముడిపెడుతున్నారు.కానీ అధికార పార్టీకి మద్దతు తెలిపే అభిమానులు మాత్రం పెట్రోల్ ధరలను సమర్ధించుకుంటున్నారు.

Telugu Petrol, Petrol Rates, Petrolrates-Latest News - Telugu

అయితే తాజాగా ఒక వాట్సాప్ గ్రూప్‌లో పెరిగిన పెట్రోల్ ధరలపై పెద్ద చర్చ జరుగుతుంది.ఆ గ్రూప్ లో చాలా మంది బీజేపీ ప్రభుత్వం మీద నిరుత్సాహాన్ని వ్యక్తపరుస్తున్నారు.అయితే అందులో బీజేపీ పార్టీ అభిమాని ఈ విషయాన్నీ జీర్ణించుకోలేకపోయారు.

తమ ప్రభుత్వ హయాంలో పెరిగిన పెట్రోల్ ధరల గురించి ఒక వింత లాజిక్కును తెరపైకి తీసుకువచ్చాడు.

ఇది మీరు చూస్తే ఆశ్చర్యపోవడం ఖాయం.అది ఏమిటంటే.పెట్రోల్ ధరలను ఒక ఆటో డ్రైవర్ కు ముడిపెడుతూ ఒక కామెంట్ పెట్టాడు.

‘పెట్రోల్ రేట్ ఆధారంగానే దేశ వ్యవస్థ నిర్ణయమవుతుంది.అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర తగ్గగానే మనం ఇక్కడ భారీగా తగ్గిస్తే ఏమవుతుందో ఉదాహరణ చెబుతా.ఇప్పుడు రూ.100 పెట్రోల్ ధర ఉన్నప్పుడు ఆటో కిరాయి కొత్తగూడెం నుంచి లోకల్‌కు రూ.20.ఆటోడ్రైవర్ రోజుకు రూ.వెయ్యి కిరాయి వస్తుంది.లీటరుపై ఒక్కసారే రూ.20 తగ్గిస్తే.అతడి కిరాయి రూ.10కి పడిపోతుంది.అప్పుడు ఆటో డ్రైవర్‌కు రోజుకు రూ.500 వస్తాయి.ఇది కేవలం ఉదాహరణ మాత్రమే.సంపాదనల్లో ఎక్కువ తక్కువలు కూడా ఉంటాయి.ఈ రోజు తాపీ మేస్త్రీ కూలి రోజుకు రూ.900.ఒకేసారి పెట్రోల్ ధర భారీగా పడిపోతే.అతడి కూలీ భారీగా పడిపోతుంది.

ఇంకా చాలా కారణాలు ఉంటాయి.మనం కొనే పెట్రోల్ నుంచే ప్రభుత్వాలకు రాబడి, మార్కెట్ రాకపోకలకు అనేక కారణాలు ఉంటాయి.

నాకన్నా ఎక్కువ తెలిసినవారు కూడా ఉన్నారు ఈ గ్రూపులో.ఎక్కువ చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు కొంత సారీ.

అని ఇంత పెద్ద కామెంట్ చేసి ముగించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube