బ్రిటన్ ఇమ్మిగ్రేషన్ లో భారీ మార్పులు...భారతీయులకు భారీ లబ్ది..!!

ఏ దేశమైనా సరే ప్రస్తుతం తమ వలస విధానంలో మార్పులు తీసుకువచ్చిందంటే అది కేవలం భారతీయ నిపుణుల కోసమే.భారత్ లోని పలు రంగాలలో నిపుణుల కోసం దేశ దేశాలు జల్లెడ పడుతుంటాయి.

 Possible Changes In Britain's Immigration Rules That Could Benefit Indians, Brit-TeluguStop.com

అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా ఇప్పుడు ఇదే బాటలో బ్రిటన్.తాజాగా బ్రిటన్ తమ దేశంలో నైపుణ్యం కలిగిన పనివంతుల కోసం ఎదురు చూస్తోంది.

అందులో భాగంగానే తమ ఇమ్మిగ్రేషన్ విధానంలో భారీగా మార్పులకు శ్రీకారం చుట్టింది.పూర్తి వివరాలలోకి వెళ్తే.

బ్రిటన్ లో కొత్తగా ఎన్నికైన ప్రధాని లిజ్ ట్రస్ ప్రభుత్వం సమూలమైన మార్పులకు సిద్దంగా ఉందని ఈ క్రమంలోనే కొన్ని విప్లవాత్మకమైన మార్పులను చేపడుతోందని స్థానిక మీడియా వెల్లడించింది.ప్రస్తుతం బ్రిటన్ లోని పలు కంపెనీలు కార్మికుల కొరత తో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి.

అలాగే నిపుణులైన వారు ప్రఖ్యాత కంపెనీలకే పరిమితమై పోతున్నారు.దాంతో తాము కూడా నైపుణ్యం కలిగిన కార్మికులను నియమించుకునేందుకు వలస విధానంలో మార్పులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలు కంపెనీలు లిజ్ ట్రస్ ను కోరాయట.గతంలో అంటే

Telugu Australia, Britain, Britishpm, Canada-Telugu NRI

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంతో మంది పరిశ్రమల అధినేతలు ఈ విషయంపై ప్రధానితో చర్చించగా ప్రధాని లిజ్ అందుకు అనుగుణంగా హామీ ఇచ్చారట.దాంతో ఇప్పుడు కంపెనీలు అన్నీ మరొకసారి ఈ విషయాన్ని ఏకరువు పెట్టగా త్వరలోనే ఇమ్మిగ్రేషన్ విధానంలో మార్పులు తీసుకువచ్చి నిపుణులైన కార్మికులను నియమించుకునేలా చర్యలు చేపడుతానని ప్రధాని చెప్పారట అంతేకాదు లిజ్ ఈ విషయంపై చర్చలు కూడా జరిపినట్టుగా స్థానిక మీడియా వెల్లడించింది.ఈ సమావేశంలో దేశంలో కంపెనీలు కార్మికుల కొరతను ఎదుర్కుంటున్న నేపధ్యంలో విదేశీ కార్మికులను నియమించుకునే విధంగా ఎలాంటి ప్రణాలికలు సిద్దం చేయాలో చూడమని అధికారులకు ప్రధాని ఆదేశించినట్టుగా స్థానిక మీడియా పేర్కొంది.ఒక వేళ ఇదే జరిగితే ఎంతో మంది భారతీయులకు భారీ లబ్ది చేకూరుతుందని, ఫలితంగా భారత్ , బ్రిటన్ ల మధ్య భంధం మరింతగా బలపడే అవకాశాలు ఉంటాయని అంటున్నారు విశ్లేషకులు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube