'ఈటెల ' ను అరెస్ట్ చేస్తారా ? తెరపైకి పాత కేసు ? 

నువ్వా నేనా అన్నట్లుగా తెలంగాణలో కెసిఆర్, ఈటెల రాజేందర్ వ్యవహారం కుదిరేలా కనిపిస్తోంది.మంత్రివర్గం నుంచి ఆయనను బర్తరఫ్ చేయడంతో పాటు, తనపై అవినీతి ఆరోపణలు చేయడం, భూకబ్జాలకు పాల్పడినట్లుగా విచారణ నివేదికలు బయట పెట్టడం, ఇటువంటి ఎన్నో అంశాలపై ఈటెల రాజేందర్ కెసిఆర్ పై రగిలిపోతున్నారు.

 Possibility Of Arresting Etela Rajender Soon-TeluguStop.com

రాజకీయంగా ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు అనే విషయాన్ని ఈ రోజు ఈటెల రాజేందర్ ప్రకటించబోతున్నారు.అయితే తనను ఇంత అవమానకరంగా బయటకు పంపడంపై రాజేందర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

నిన్ననే దాదాపు 700 కార్లతో ర్యాలీగా హైదరాబాద్ నుంచి తన నియోజకవర్గమైన హుజురాబాద్ కు వచ్చారు.ఆయనకు స్వాగతాలు లభించాయి.

 Possibility Of Arresting Etela Rajender Soon-ఈటెల ను అరెస్ట్ చేస్తారా తెరపైకి పాత కేసు  -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

భారీ జన సందోహం మధ్య ఆయన ర్యాలీ కొనసాగింది.దీంతో రాజేందర్ పెద్ద వ్యూహంతోనే ఉన్నారని ఖచ్చితంగా టిఆర్ఎస్ లో ప్రకంపనలు సృష్టిస్తుంది అనే విషయాన్ని కేసీఆర్ గ్రహించారు.

ఆయన విషయంలో మరింత కీలక నిర్ణయం తీసుకోకపోతే ఇబ్బందులు ఏర్పడతాయి అనే ఉద్దేశంలో ఉన్న కేసీఆర్ ప్రస్తుతం ఈటెలపై భూ కబ్జా విచారణ తో సరిపెట్టకుండా, ఈటెల రాజేందర్ ను అరెస్టు చేసి కొంత కాలం పాటు,బయటకి రాకుండా చేయాలని, అలా చేస్తే ఆయన రాజకీయంగా ఏ స్టెప్ తీసుకోకుండా కట్టడి చేసినట్లు అవుతుందని, జనాల్లోనూ రాజేందర్ పై ఉన్న సానుభూతి తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.అయితే ప్రస్తుతం ఈ దేవరాయంజల్ భూముల వ్యవహారం పై మరింత లోతుగా దర్యాప్తు చేయించి, ఈ కేసులు అరెస్టు చేస్తే ఇందులో ఇతర పార్టీల నాయకులతో పాటు, టిఆర్ఎస్ లోని కీలక నాయకులు ఇబ్బంది పడతారనే సందిగ్ధంలో పడ్డారట.

Telugu Etela Rajendar, Etela Rajendar Arrest, Etela Rajender, Etela Rajender Arrest, Former Health Minister, Hujurabad, Kcr Angry On Etela Rajendar, Kcr Government, Ktr, Ktr Cm, Telangana Moment, Telangana Politics, Trs Party, Trs Party Leaders-Telugu Political News

అందుకే ఆ విషయంలో కాకుండా, గతంలో ఆయన పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలు, అప్పుడు వివాదాస్పదమైన కొన్ని అంశాలను బయటకు తీసి, ఆ కేసులో ఆయనను అరెస్టు చేయించాలనే వ్యూహంలో టిఆర్ఎస్ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది.అసలు ఈటెల రాజేందర్ పై కేసీఆర్ ఈ స్థాయిలో కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి కారణం, కేటీఆర్ ను సీఎం చేసేందుకు రాజేందర్ ఒప్పుకోక పోవడమే కారణంగా తెలుస్తోంది.ఈ విషయంలో ఆయన కొంత మంది పార్టీ పెద్దల దగ్గర మాట్లాడిన మాటల పై కేసీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉండటంతోనే, ఇప్పుడు ఈటెల పై ఆకస్మాత్తుగా వేటు వేయడంతో పాటు అరెస్టు చేయించేందుకు వెనకాడకపోవడానికి కారణమట.

#Trs Party #KCR Government #Etela Rajendar #EtelaRajendar #Hujurabad

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు