గూస్ బంప్స్ వచ్చేలా ఉన్న బోయపాటి, రామ్ మూవీ గ్లింప్స్.. లెజెండ్, అఖండలను మించి?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకవైపు సీనియర్ హీరోలతో మరోవైపు యంగ్ హీరోలతో సినిమాలను తెరకెక్కిస్తూ బోయపాటి శ్రీను(Boyapati Sreenu) కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.అఖండ( Akhnda ) సినిమాతో బాలయ్యకు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన బోయపాటి శ్రీను ప్రస్తుతం రామ్(Ram) తో ఒక సినిమాను తెరకెక్కిస్తున్నారు.

 Positive Response For Ram Boyapati Combo Movie Details Here Goes Viral In Social-TeluguStop.com

ఈ సినిమా నుంచి తాజాగా ఫస్ట్ థండర్( First Thunder ) పేరుతో గ్లింప్స్( Glimpse ) రిలీజ్ కాగా ఈ గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

బోయపాటి మార్క్ తో గూస్ బంప్స్ వచ్చేలా ఉన్న ఈ గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా దసరా కానుకగా ఈ సినిమా థియేటర్లలో రిలీజవుతోంది.ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో బిజీ అవుతూ గోల్డెన్ లెగ్ గా పేరు సంపాదించుకున్న శ్రీలీల( Srileela ) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండటం గమనార్హం.

Telugu Boyapati Srinu, Thunder, Glimpse, Ram, Srileela, Tollywood-Movie

లెజెండ్( Legend ), అఖండ సినిమాలను మించి ఈ సినిమా గ్లింప్స్ ఉండగా ఈ గ్లింప్స్ గూస్ బంప్స్ వచ్చేలా ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.ఈరోజు రామ్ పుట్టినరోజు కావడంతో ఈ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.రామ్ యాటిట్యూడ్ గ్లింప్స్ కు హైలెట్ గా నిలవగా పవర్ ఫుల్ యాంబియన్స్, పవర్ ఫుల్ డైలాగ్స్ ఈ గ్లింప్స్ కు ప్లస్ అయ్యాయి.బలమైన దున్నపోతును పట్టుకుని రామ్ నడిచే షాట్ ఆకట్టుకుంది.

Telugu Boyapati Srinu, Thunder, Glimpse, Ram, Srileela, Tollywood-Movie

బోయపాటి శ్రీను సినిమాలకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చే థమన్ రామ్ బోయపాటి కాంబో సినిమా గ్లింప్స్ కు ఇచ్చిన మ్యూజిక్ తో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.నిర్మాతలు ఈ సినిమా ఖర్చు విషయంలో అస్సలు రాజీ పడలేదని తెలుస్తోంది.దసరా పండుగ కానుకగా అక్టోబర్ 20వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుండగా ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube