ఇంట్లో నెమలి పించం ఉంటే ఎంత మంచిదో తెలుసా.. తప్పక తెలుసుకోవాల్సిన విషయం  

Positive Effects Of Keeping Peacock Feathers At Home-

మన పెద్దలు చెప్పే కొన్ని పద్దతులు మరియు అలవాట్లు మూడ నమ్మకాలుగా అనిపిస్తాయి.కాని వాటిని ఆచరిస్తే మాత్రం చాలా మంచి ఫలితాలు ఉంటాయి.కొన్ని శాస్త్రీయంగా కూడా నిరూపించబడి మంచివిగా పేరు దక్కించుకున్నాయి.ఇంట్లో కొన్ని వస్తువులు ఉంటే మంచిది అంటారు.

Positive Effects Of Keeping Peacock Feathers At Home- తెలుగు భక్తి కళ ఆద్యాధమిక ప్రసిద్ధ గోపురం పండగలు పూర్తి విశేషాలు -Positive Effects Of Keeping Peacock Feathers At Home-

అలాంటి వాటిలో నెమలి పించం కీలకంగా ఉంటుంది.నెమలి పించం ఇంట్లో ఉంటే చాలా రకాలుగా మంచి జరుగుతుందని పండితులు మరియు ప్రముఖులు కూడా అంటున్నారు.నెమలి పించం అనేది దైవంకు రూపం అన్నట్లుగా చెబుతారు.శ్రీకృష్ణడు నెమలి పించంను తలపై పెట్టుకున్న విషయం తెల్సిందే.

Positive Effects Of Keeping Peacock Feathers At Home- తెలుగు భక్తి కళ ఆద్యాధమిక ప్రసిద్ధ గోపురం పండగలు పూర్తి విశేషాలు -Positive Effects Of Keeping Peacock Feathers At Home-

నెమలి పించంకు ఆయన అంత ప్రత్యేకమైన శ్రద్దను చూపాడు కనుక ఖచ్చితంగా నెమలి పించం గొప్పదనే భావన ఏర్పడింది.

నెమలి పించంను ఇంట్లో ఉంచుకుంటే కలిగే లాభాలు…

ఇంట్లో ఏమైనా వాస్తు దోషాలు ఉన్నా లేదంటే ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నా కూడా నెమలి పించం వల్ల అవి పోతాయి.అంతా మంచి జరుగుతుందని పెద్దల నమ్మకం.

ఇక ఇంట్లో పిల్లలు లేదా పెద్దలకు గ్రహ దోషం వంటివి ఏమైనా ఉంటే ఇంట్లో నెమలి పించం పెట్టుకోమని పెద్దలు సూచిస్తున్నారు.నెమలి పించంతో ఆ దోషాల ప్రభావం తక్కువగా ఉంటుందని అంటున్నారు.

పిల్లల ఏకాగ్రత పెంచడం కోసం మరియు వారిని అహ్లాద పర్చడం కోసం కూడా వారి రూపంలో లేదా ఇంట్లో నెమలి పించం ఉంచడం మంచిది.నెమలి పించంను తదేకంగా చూడటం వల్ల మనసు ప్రశాంతంగా అయినట్లుగా అనిపిస్తుంది.అందుకే పిల్లలకు అది ఏకాగ్రత పెంచి చదువుపై ఆసక్తిని కలిగించేల చేస్తుంది.

రాహు కేతు పూజలు చేయించుకునే వారు, ఆర్థిక, ఆరోగ్య పరమైన సమస్యలు పడుతున్న వారు పడుకున్న సమయంలో తలగడ కింద నెమలి పించం పెట్టుకుంటే అంతా మంచి జరుగుతుంది.

ఇంట్లో బెడ్‌ రూంలో తూర్పు వైపున లేదా ఈశాన్యం మూలలో నెమలి పించం ఉన్నట్లయితే అన్ని రకాలుగా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.

చిన్న నెమలి పించం పెడితే ఇంత మంచిది అన్నప్పుడు పెడితే పోయేది ఏముంది చెప్పండి.

ఈ విషయాన్ని తప్పకుండా మీ స్నేహితులతో షేర్‌ చేసుకోండి.